నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని గుర్తుచేశారు. బహిష్కరించిన నేతలు ఆయా ప్రాంతాలకు బడ్జెట్ లో ఏమీ కేటాయించలేదని వారు మీటింగ్ కు వచ్చి సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలని అని అన్నారు. సంకీర్ణ భాగస్వాములను సంతృప్తి పరచడానికి బిహార్, ఆంధ్రప్రదేశ్ లకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని కేంద్రంపై మండిపడ్డారు. ‘విద్య, ఆరోగ్యం రంగాలకు బడ్జెట్ తగ్గిపోయింది. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. తమ సంకీర్ణ భాగస్వామ్యుల కోసం ప్రభుత్వం రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. బీహార్ రాష్ట్రానికి లభించింది తమ రాష్ట్రానికి వస్తే సంతోషిస్తాం. బిహార్ లో హైవేల కోసం రూ.26వేల కోట్లు కేటాయించారు. ఇది చిన్న విషయం కాదు. బిహారీలకు మంచిదే. అయితే, కర్ణాటను కాస్త పట్టించుకోండి. బెంగుళూరులో హైవేలు, టన్నెల్స్ కోసం నిధులు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ వారికి ఏదీ దక్కలేదు. ఇది కేవలం రాజకీయవ్యూహమే అని నీతి ఆయోగ్ సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేసారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్.భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్…
- రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని.. దీనికి…
- మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
- వరంగల్‌లో డీఆర్ఐ అధికారుల సంచలన ఆపరేషన్..వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
- పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 80599