నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో బీజేపీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు హాజరై అర్వింద్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నా సీఎం కేసీఆర్ మేలు అని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ పదేండ్లు కొట్లాడాడు.. అప్పడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారని అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆంధ్రాలో ఉన్న టీడీపీ చేతిలో తెలంగాణను పెట్టినట్లేనని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రేవంత్ రెడ్డి హోల్ సేల్‌గా అమ్మేస్తాడని విమర్శలు చేశారు. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి సంచులను మోసుకెళ్లాడు.. ఆ కేసును సీఎం కేసీఆర్ కాపాడుతున్నాడని విమర్శించారు.
Nizamabad
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణకు రానున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఉదయం11.30 గంటలకు బోధన్‌లోని సభకు హాజరవుతారు. ఆ తర్వాత నిజామాబాద్, 1.30కు ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్, సాయంత్రం 3.30 గంటలకు వేములవాడ, రాజన్న సిరిసిల్లా నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు. రాష్ట్రంలోని కీలక నేతలతో ఎన్నికల పరిస్థితులపై చర్చిస్తారు.
గులాబీ బాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తూప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇక.. రెండోవిడత ప్రచారంలో భాగంగా కారు స్పీడ్ పెంచారు గులాబీ దళపతి. ఇవాళ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, మెదక్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
కేసీఆర్‌ను మించిన మోసగాడు..రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అర్వింద్.
కేసీఆర్ మీద కల్వకుంట్ల కుటుంబం మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఒక్కసారిగా మాట మార్చారు. కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యపోయే కామెంట్లు చేశారు. అది కూడా రేవంత్ రెడ్డితో పోల్చుతూ.. ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాట్లాడిన అర్వింద్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావటం అసంభవమని.. బీజేపీకే స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకపోతే హంగ్ వచ్చే అవకాశం ఉందని.. అలా జరిగితే అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అర్వింద్.
ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు అర్వింద్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి.. కేసీఆర్‌ను మించిన మోసగాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోల్చితే కేసీఆరే మంచోడంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు ఎవరూ లేరన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ వెళ్తే మేడిగడ్డలో పిల్లర్లు మునిగిపోతాయంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని త్వరలోనే బయటపెడతానని చెప్పుకొచ్చారు.





Total views : 75213