రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, brs నుంచి ఎమ్మెల్యే గా 3వ సారి భారీ మెజారిీతో గెలిచినా సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు, కార్యకర్తలు తో కలిసి స్థానిక శివ గంగ ఆలయం లో పూజలు చేసి, స్థానిక పోతర్ల బాబయ్యా హల్ లో కార్యకర్తను, నాయకులతో, స్థానిక ప్రజలతో కలసి మాట్లాడరు. కృత్గ్నగా తలు తెలిపారు. మహేశ్వరం ప్రజలు తమ పట్ల చూపిన అభిమానం, ఆదరణ, మరువ లేనిది. మీ రుణం తీర్చుకుంట అని ఎమోషనల్ గా మాట్లాడారు. కష్ట పడి పార్టీ కోసం పని చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది విజయోస్థవ సభా కాదు. కృత్గ్న ఙ్ఞత సభ బాధ్యత గా పని చేస్తా, ప్రజా సమస్యల గురించి అలుపు లేకుండా కృషి చేస్తా. ప్రభుత్వం ఎది అయినా పని తీసుకోవడం లో ముందుంట ఇక మీదట మీలో ఉంటా, మీతో కలిసి ఉంటా, ప్రతి ఎలక్షన్ లో మిమ్మలి గెలిపించూకుంట. మి గెలుపు నా గెలుపు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త తో కలుస్థా మీ గెలుపుకు కృషి చేస్తా… అని తెలిపారు.
political news
ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐటియుసి ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు హేమావతి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్ శివ యూనియన్ జిల్లా కార్యదర్శి చాముండేశ్వరులు మాట్లాడుతూ ఆశా కార్మికులకు అనేక సమస్యలతో ఉన్నారని ప్రభుత్వం అధికారులు హామీలు ఇచ్చారు తప్ప, అమలు చేయడం లేదని వాటిని అమలు చేయాలి అని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది
మిచౌంగ్ తుఫాను కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షలు వరదలకు జన జీవనం వక్క సారిగా స్తంభించిపోయింది. కనీస నిత్యవసరాలు, కరెంటులేక, నీళ్లురాక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, మంత్రి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ… తుఫాను ప్రభావంతో అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు మేలు చేయాల్సింది మరిచి ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడటం సవాబ్ కాదు అన్నారు. మీకు చేతనైంది మీరు చేయండి అని ఆనందబాబుకు సవాళ్లు విసిరారు. మీ ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అన్నారు. అదే మన ముఖ్యమంత్రి వ్యవసాయం పండగానే నినాదంతో ప్రతి రైతుకు సాయం అందిస్తారని విమర్శించారు.
Read Also…
Read Also…
ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సంస్థ ఇతర ప్రతినిధులతో కలిసి ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పార్టీ, రెండూ సమాంతర వ్యవస్థలు, ప్రభుత్వంపై పార్టీ ప్రభావం పడకూడదు. ప్రభుత్వ వనరులతో, ప్రభుత్వ సిబ్బందితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అనైతికం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇటీవల జారీ చేసిన జీవో నెం.7 ద్వారా పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కలిపే నిర్వహిస్తున్నారు. ఎన్నికలు, సమీపిస్తున్న తరుణంలో వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. అందుకే ఆయన్ను కలిసి రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చూడాలని ఫిర్యాదు చేశాం. పారదర్శకమైన పాలన జరగాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆశిస్తోంది’’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం కూడా అనైతికమని ఆయన స్పష్టం చేశారు. ఓట్లు తొలగించేటప్పుడు సంబంధిత వ్యక్తికి ముందుగా నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలన్నారు. పౌరుడు ఎన్నిక చేసుకున్న ప్రదేశంలోనే ఓటు హక్కు కల్పించాలని, నివాసం లేనంత మాత్రాన ఓటు హక్కు తొలగించకూడదని అభిప్రాయపడ్డారు. కేవలం బీఎల్వోల ఫిర్యాదు మేరకు ఓటు హక్కు తొలగిస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు.
సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా తల్లికి పాదాభివందనం చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో నిన్న పలువురు నేతలను కలిశారు. ఇందులో భాగంగా దీపేందర్ సింగ్ హుడా నివాసానికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కోరారు. ఈ సమయంలో హుడా తల్లి… రేవంత్ రెడ్డికి తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించి దీపేంద్ర సింగ్ హుడా ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత తన ప్రియమిత్రుడు రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకొని తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని పేర్కొన్నారు. నిజమైన స్వేహితుడిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చారని, సీఎం అవుతున్నప్పటికీ గతంలో కంటే ఆత్మీయత కనిపిస్తోందని పేర్కొన్నారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరుపుతుందని బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 31న ముగియనుంది. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో జిల్లాల వారీగా రిపోర్ట్ సిద్ధం చేయాలంటూ కలెక్టర్లకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ ఈ మేరకు లేఖ పంపించారు. డిసెంబర్ 30లోపు కసరత్తు పూర్తిచేసి వివరాలు అందించాలని కోరారు. ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఎంపిక, పోలింగ్ సిబ్బంది. రాండమైజేషన్ సిస్టమ్ సాప్ట్వేర్ అప్లికేషన్లో వివరాల నమోదు చేయడం వంటి వాటిపై కలెక్టర్లకు కీలకమైన సూచనలు చేశారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శులు ఎన్నికల సంఘానికి పంపించారు. తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలు, లక్షా 13 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. అయితే ఇవి ముందస్తు ఏర్పాట్లు మాత్రమేనని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనేది నూతనంగా ఏర్పడబోయే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే తెలంగాణ ఎన్నికల కసరత్తు మొదలవ్వడం గమనార్హం.
పామర్రు (మ) శ్యామలపురం, కంచర్లవానిపురం గ్రామాల్లో పనల పై వున్నా వరి పనలను పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. మొవ్వ (మ) అయ్యంకి గ్రామంలో జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ తో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. .పంట చేతికి వచ్చే టైం లో తుఫాన్ రావడం దురదృష్టం. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. రైతులు నష్టపోకుండా ప్రతి ధాన్యం కొనుగోలుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. మిషన్‌తో కోసిన ధాన్యమంతా మిల్లులకు చేరిపోయింది. సబ్సిడీపై మినుము విత్తనాలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతిపక్షాలు దీని రాజకీయం చేయవద్దని మీడియా ద్వారా కోరుతున్నాను. జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యాన్ని కైకలూరు, గుంటూరు, పల్నాడు పంపించాం మేజర్, మైనర్ డ్రైన్స్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. రైతులకు నష్టం జరగకూడదు అనేది ముఖ్యమంత్రి రెడ్డి ఆలోచన.
తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను,జగనన్న కాలనీలను పరిశీలించారు. తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. వర్షపు నీరు పోయేందుకు డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో నీటిలోనే… పంట నాని ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే రైతులకు ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. నష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సిఎం జగన్ అన్ని చర్యలు తీసుకున్నాం అనడం సరికాదనీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి రైతుల పరిస్తితి తెలుసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. మరోవైపు వర్షపు నీటిని జగన్న కాలనీలు అధ్వానంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బంది కరంగా మారాయన్నారు. సరైన సౌకర్యాలు లేక కాలనీల్లో ఉంటున్న పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.తుఫాను ప్రభావంతో వాణిజ్య పంటలు దెబ్బతిని లంక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.అరటి తోటలు గాలుల ప్రభావానికి నేల వాలయి ..కంద,పసుపు పంటలు వర్షపు నీటితో నాని రైతులకు నష్టం వాటిల్లింది.చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని నష్టాన్ని మిగిల్చాయి అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
తుఫాను కారణంగా నిరాశ్యులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యవసరకులు, 25 కిలోల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మరియు మంత్రివర్యులు బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు చేపట్టిందని మంత్రి నాగార్జున తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు మేలు చేయాల్సింది మరిచి ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడటం సవాబ్ కాదు మీకు చేతనైంది మీరు చేయండి అనే ఆనందబాబుకు సవాళ్లు విసిరారు. మీ ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అన్నారు. అదే మన ముఖ్యమంత్రి వ్యవసాయం పండగానే నినాదంతో ప్రతి రైతుకు సాయం చేసె గుణం మా ముఖ్యమంత్రి ది ప్రతి రైతుకు రైతు భరోసా కౌల రైతులకు భరోసా ఇన్పుట్ సబ్సిడీ పంట రాష్ట్ర పరిహారం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వ్యవసాయ సలహాలు ఇస్తున్న వ్యవసాయ సిబ్బంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం మాది మాట్లాడే ముందు మీరు ఏం చేశారు అనేది తెలుసుకోండి. ఇప్పుడు చేతనైతే సహాయం చేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయం చేద్దాం ఇప్పుడు ప్రజలకు మేలు చేద్దాం చేతనైతే మేలు చేయండి అని ఆనంద్ బాబుకు ఇతవు పలికారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటన లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుని నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన పోల హేమంత్ (20)గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ తిరుమల రాజు ఉన్నారు వీరి ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





Total views : 141704