కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన కాకినాడ నగరంలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడ సినిమా రోడ్లో ఉన్న సంత చెరువు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి బయట శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన గుడి బయట వైసీపీకి చెందిన నాయకులు స్పీకర్లనుండి వచ్చిన కీర్తనలకు భజనలు చేపట్టారు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. తమ అభిమాన నేత ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తుంటే దానికి మేము ఆందోళన వ్యక్తం చేయగా వైకాపా వాళ్లు పోటీగా పెద్ద శబ్దాలతో దేవుని భజనలు చేయడం అన్యాయమన్నారు. టీడీపీ, వైకాపా వాళ్లు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేయగా పోలీసులు చేరుకొని ఎటువంటి వివాదాలు రాకుండా సర్ది చెప్పారు.. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ పి మురళీకృష్ణ రెడ్డి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ బి అప్పారావులతో పాటు పోలీసు సిబ్బంది వైకాపా, టీడీపీ నాయకులతో కొంతసేపు చర్చలు జరిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం లేదని పక్కకు జరుపుతున్నామని వైకాపా వారు చెప్పగా దానికి టీడీపీ వాళ్ళు అక్కడే కుడి పక్కకు మార్చాలని పట్టుబట్టారు. కొంతసేపు వాగ్వివాదం వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య జరిగింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
Tdp
రాష్ట్రంలో వైసీపీ సినిమాకు ఇంకా వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కుప్పం నాకు సొంత కుటుంబం లాంటిదని ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేసే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ రెండు ఆవులు ఉంటే మంచిదని ఆనాడే చెప్పానని ఆవులు పెంచడం ఏంటని అప్పుడు నన్ను ఎగతాళి చేశారని గుర్తు చేశారు. పాడిని ఒక పరిశ్రమగా చేసి, మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు 3వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదని 100 రోజులు నా కోసం, మీ కోసం పనిచేస్తే మీ జీవితాలు మార్చే బాధ్యత టీడీపీ – జనసేన తీసుకుంటుందని టీడీపీ అధినేత అన్నారు. రాష్ట్రంలో నాలాంటి వాడికే రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. నిన్న బెంగళూరు నుంచి కుప్పంకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకి కుప్పం సరిహద్దులలో టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు పలికారు. రెండవ రోజు చంద్ర బాబు పర్యటన మరికాసెపట్లో ప్రారంభం కానుందని, నిన్న చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలకడానికి వచ్చిన నాయకులను కార్యకర్తలను చూసి వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఈసారి కుప్పం ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడుని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు.
Read Also..
తిరుపతి, టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు. పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు. తిరుపతిలో టిడిపి, జనసేన, సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని, కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్. టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరిగింది. వేల ఎకరాల అసైన్డ్ భూములన్నీ కొట్టేశారు. రెవెన్యూ చట్టాన్ని మార్చారు. దానికోసమే అడ్వకేట్లంతా కోర్టులను బాయికాట్ చేస్తున్నారు. రాష్ర్టంలో రైతుల భూములన్నీ నాయకుల చేతిలోకి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు. మా పార్టీ లోకి రాకుంటే భూములు లాక్కుంటము అనే ఉద్దేశంతో ఈ చట్టం. డాక్యుమెంట్ మా దగ్గర ఉంటుంది డౌన్ లోడ్ చేసుకోండి అంటున్నారు.ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎవరు ఎన్ని డాక్యుమెంట్ లైన డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఎన్ని బ్యాంక్ లలో నైన లోన్ తీసుకోవచ్చు. ప్రజలను నిలువు దోపిడీ చేద్దామని చూస్తున్నారు. ఇకనైనా జగన్ మీ దోపిడీ ఆపాలి. మేం అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం.
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వలవల మల్లిఖార్జునరావు సమావేశం. ఏడు సార్లు విద్యుత్ రెట్లు పెంచి ప్రజలపై 64 వేల కోట్లు భారం వేసిన చరిత్ర జగన్ ది. మద్యం మొత్తం నిషేదిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మద్యాన్ని ఏరులై పారించడంతో పాటుగా దాని పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ లేకుండా వేల కోట్లు పక్కదారి పట్టిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులకు అదోగతి పాలుచేశారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ, మున్సిపల్ సిబ్బంది వాలింటర్లును నమ్మించి మోసం చెయ్యడంతో వారంతా రోడ్లు మీదకు వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా వైఎస్ ఆర్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. వైఎస్ ఆర్ పార్టీ అంటే మునిగిపోయే పడవ. వలవల మల్లికార్జున రావు, బాబ్జి తాడేపల్లిగూడెం టిడిపి ఇన్చార్జ్.
పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ అక్రమ గ్రావెల్ తరలింపుకు పాల్పడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణ చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజాపోరాటం పేరుతో ఆయన రెండు రోజుల పాటు పాదయాత్రకు సిద్ధమైనారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారినశేకూరు, వీరనాయకునిపాలెం, శలపాడు, వేజండ్ల, సుద్దపల్లి, చేబ్రోలు, వడ్లమూడి గ్రామాల మీదుగా పాదయాత్ర చేపట్టనున్నారు. గత నాలుగున్నరేళ్లలో 2200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్ పై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. గతంలో ఫిర్యాదుల ఆధారంగా విధించిన 5 కోట్ల రూపాయల ఫెనాల్టీ కూడా వసూలు చేయలేదని ధ్వజమెత్తారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు, అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదన్నారు. గతంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ స్థాయిలో, నేడు కిలారు మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరగుతోన్నాయంటూ ఆయన ఆరోపణ చేశారు.
పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడి. గురజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన పాట కచేరీలు పై వైసిపి నాయకులు దాడి. బ్యానర్లు చించి దాడికి తెగపడ్డ వైసీపీ నాయకులు. సుమారు 300 మంది వైసిపి నాయకులు , కార్యకర్తలు కర్రాలతో దాడి. మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డ వైసిపి మూకలు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఇరువర్గాలని చెదరగొట్టిన పోలీసులు.
ప.గో.జిల్లా, తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టిన మాజి ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ,తెలుగుదేశం కార్యకర్తలు. నియోజకవర్గంలో చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని పోలీస్ లు అడ్డుకుంటున్నారంటూ ధర్నా. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఒత్తిడితో పోలీసులు టిడిపి శ్రేణులను అడ్డుకుంటున్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కి ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు .
వంగవీటి మోహన రంగారావును హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూశారని, కానీ చంపలేకపోయారన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. రంగాను టీడీపీ ప్రభుత్వం చంపిందని కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు చెప్పాడని గుర్తు చేశారు. పదవి శాశ్వతం కాదని, పదవి కోసం పాకులాడే వారిని చరిత్ర క్షమించదని కన్నాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతలో రాజశేఖర్ రెడ్డి వెంట నడిచానని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నానని తెలిపారు. జగన్ ను జైల్లో పెట్టిన తర్వాత అంబటిని కూడా జైల్లో పెడతారని అన్నారని నమ్ముకున్న మనిషి కోసం, సిద్ధాంతం కోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటానని అంబటి స్పష్టం చేశారు.
Read Also..
Read Also..