శ్రీవారి దర్శించుకున్న చంద్రబాబు మాట్లాడుతూ పాద పద్మాల చెంత పుట్టి అంచెలు అంచెలుగా ఏదిగా. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు నన్ను కాపాడారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నా. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించా. మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చి దర్శనం చేసుకున్నా. భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి..తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి. ప్రజలకు సేవ చేసే శక్తీ,సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నాను. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా అని చంద్రబాబు అన్నారు.
tirumala
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి, ఈ ఉదయం సతీసమేతంగా చంద్రబాబునాయుడు వెంకటేశ్వరస్వామి దర్శనం.
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. శ్రీవారి దర్శనం కోసం 04 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,176 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం..4.22 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…20,157 మంది.టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి ఉదయం 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం.తిరుమల శ్రీవారిని నిన్న 67,198 మంది దర్శించుకున్న భక్తులు.నిన్న హుండీ ఆదాయం..4.19 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…22,452 మంది.21 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 12 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం కురిసిన ఈ వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయమయ్యాయి. దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత మరింత పెరిగింది.
అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 చంద్రగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున జరుగనున్న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి 7:05ని.లకు ఆలయ తలుపులు మూసివేసి తిరిగి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు.





Total views : 91076