తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రథం నుంచి ఆయన ముందుకు పడ్డారు. ఇదే సమయంలో వాహనంపై నుంచి సురేశ్ రెడ్డి, జీవన్ రెడ్డి నేలపై పడ్డారు. కేటీఆర్ కింద పడకుండా ఆయన గన్ మెన్లు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓపెన్ టాప్ వాహనంపై వీరు ప్రయాణస్తుండగా వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడం వలన వాహనంపై ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో వారంతా అదుపు తప్పి ముందుకు పడిపోయారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. తన ఆరోగ్యానికి ఏమి ప్రమాదం లేదని చెప్పారు. తరువాతి ర్యాలీకి కేటీఆర్ వెళ్లారు.
Trs
చేవెళ్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రచారం జోరు అందుకున్నది ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు ప్రతి వాడవాడ తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ ప్రచారం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతోనే ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టు కాలే యాదయ్య తెలిపారు..
Read Also..
ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజల మేలు మరిచిపోలేను. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారింది…టీఆర్ఎస్ పేరిట తప్పుడు రాజీనామా చేశారు. ఇది కూచుకుళ్లకు తగునా. ఉద్యమ సమయంలో నేను ఎమ్మెల్యే పదవి కొట్లాడి రాజీనామా ఆమోదించుకున్నా. నాగర్ కర్నూల్ పై రాజేష్ రెడ్డికి జీరో నాలెడ్జి పోటీ ఎలా చేస్తాడు. రేవంత్ ఫేక్ సర్వేతో…పాపులారిటీలో నేను నెంబర్ 10 అన్నారు. ప్రజలను మోసం చేసే కూచుకుళ్ల నాగర్కర్నూల్ కు అవసరమా. సీఎం కేసీఆర్…రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయంలో తలమానికంగా మారింది. సీఎం కేసీఆర్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న శ్రేణులూ కలిసిపోయేలా కృషి చేస్తా.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు కాలనీల కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలోని అంబేద్కర్ కాలనీలో టిఆర్ఎస్ రాష్ట్ర నేత గూడెం మధుసూదన్ రెడ్డి సమక్షంలో దాదాపు రెండు వందల మందికి పైగా యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
డబ్బు మద్యం ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం టిఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపిలకు ఉందా? అని నర్సంపేట నియోజకవర్గం ఎంసిపిఐ(యు) ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ సవాల్ విసిరారు. ఓటర్లకు డబ్బు మద్యం ఎరవేయకుండా ప్రలోభాలకు గురి చేయకుండా ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. ఆశయాలకు అనుగుణంగా నీతిగా నిజాయితీగా విధానాల ప్రాతిపదికన ప్రజలను చైతన్యం చేసి ఓట్లు అభ్యర్థించే ఏకైక పార్టీ ఎంసిపిఐ(యు) అని అన్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు గుమ్మరించి మద్యం మత్తులో ఓట్లు దండుకొని రాజకీయాలను వ్యాపారంగా మార్చిన రాజకీయ పార్టీలను గుర్తించాలని కోరారు. నీతివంతమైన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్ధుడైన బహుజన బిడ్డగా నన్ను ఆదరించాలని ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను గోరెంట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో గాదరి కిషోర్ ప్రచారం చేశారు. అయితే అభివృద్ది ఎక్కడంటూ గ్రామస్ధులు అడ్డుకుని ప్రశ్నించారు. ప్రచారం కోసం వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్నా పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులకే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్థులపై ఉంటే ఉండండి…లేకపోతే వెళ్లిపోండంటూ విరుచుకుపడ్డారు. తనను అడగాల్సింది సభలోనని…ఇదేమీ సభ కాదని అన్నారు.





Total views : 91212