బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకొని మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ…ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం పట్ల ఆదరణ పెరుగుతుందన్నారు. సనాతన ధర్మ వ్యాప్తి కోసం మరింత కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి 22 సువర్ణ అక్షరాలతో లికించబడుతుందన్నారు. 500ఏళ్ల నాటి కల రామమందిర నిర్మాణం జరిగిందని…22వ తేది రామ మందిరాన్ని ప్రారంభించడం శుభదాయకమన్నారు. సనాతన ధర్మాన్ని వినాశనం చేయడానికి పూనుకున్న వారే నాశనం అయ్యారని. ఇందుకు చరిత్రే నిదర్శనమన్నారు.
TTD
తిరుపతి గరుడ సర్కిల్ లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైంది, ఉదయం 7 నుంచి 10 గంటల సమయం మధ్యలో మైత్రి మూవీస్ మేకర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ సంబంధించి గరుడ విగ్రహం ఎదురుగా యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించారు. అయితే అదే సమయంలో తిరుమలకు వెళ్లే భక్తులకు పూర్తిగా ఇబ్బంది ఏర్పడింది. మరోవైపు ఇటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు గంటపాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనితోపాటు ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ నుంచి చిత్రీకరిస్తున్న యూనిట్ సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తున్న వారిపై దాడులకు సైతం పాల్పడ్డారు. ముఖ్యంగా గరుడా విగ్రహం ఎదుట యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. మరోవైపు పోలీసులు పవిత్రమైన గరుడ సర్కిల్లో ఏవిధంగా అనుమతిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గరుడ సర్కిల్ వద్ద నిరసన తెలియజేయడానికి కూడా అనుమతించిన పోలీసులు అధికారులు ఇప్పుడు షూటింగ్ కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
తిరుమలలో శ్రీరామకృష్ణ ముక్కోటి తీర్థంను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఈ తీర్థం వెలసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించడం అనవాయితీ. భారీ స్థాయిలో భక్తులు రామకృష్ణ తీర్థ ముక్కోటిలో పాల్గొన్నారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించడం వల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభించి, సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం. ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహప్రతిష్ట, శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకోసం గురువారం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్‌తో పాటు ఏఈవో శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
దేవతాస్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు తెలిపారు. తిరుమల శ్రీవారికి దేశీయ గో జాతుల పాల నుండి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు తెలియజేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలను రద్దు చేసింది. సంక్రాంతి సందర్భంగా 14న శ్రీ గోవిందరాజులస్వామివారి ఆలయంలో భోగితేరు, 15న మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. 14న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగిస్తారు. 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. అదే రోజు గోదా పరిణయోత్సవం కూడా ఉంటుంది. ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెదజీయర్ మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారికి సమర్పిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేస్తారు. ఆస్థానం, పార్వేట కార్యక్రమాల అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీడీడీ రద్దు చేసింది. శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి.
Read Also..
చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడు. స్వామి, అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడు. పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు తయారుచేసే గది, మృత్యుంజయ పూజలు నిర్వహించే ప్రదేశంలో వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలను కూల్చేయిస్తున్నాడు. పురావస్తు, దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చారిత్రక, పురావస్తు, ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు, పాపం. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని టిడిపి పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
తిరుమలలో నూతన సంవత్సర వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీవారి ఆలయం, ఆలయ పరిసర ప్రాంతాలంతా విద్యుత్ దీపాలంకరణలతో దగదగా మెరిసిపోయాయి. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 కు స్వాగతం పలుకుతూ 12 గంటల సమయంలో భక్తులు ఆలయం ఎదురుగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. గోవింద నామస్మములతో భక్తులు 2024 ను స్వాగతించారు. ఒకరికొకరు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తినిపించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వీరు స్వామి వారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు, స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠ ఉత్తర వాకిలి దర్శనం చేసుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి నరేందర్, సెంట్రల్ పవర్ మినిస్టర్ కృష్ణ పాల్ గుర్జార్ వెంకటేశ్వర స్వామిని వేరువేరుగా దర్శించుకున్నారు. అలాగే వైసిపి మినిస్టర్ అంబటి రాంబాబు సినీ పరిశ్రమ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టిటిడి అధికారులు దర్శనం చేయించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
Read Also..
తిరుపతి ఇళ్ల స్థలాలు కేటాయింపు సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గారు మాట్లాడుతూ సరిగ్గా 17 ఏళ్ల క్రితం దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటయింపు చేశాం. కార్మిక పక్ష పాతిగా, ఉద్యోగ పక్ష పాతి గా మేము ఉన్నాము, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలి అని సీఎం జగన్ అన్నారు అన్నట్టుగానే ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేశాం. నాకు అత్యంత ఇష్టమైన పని టిటిడి ఉద్యోగులకు ఇళ్లు పట్టాలు ఇవ్వడం, సంతోషం గా ఉంది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు అని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలని సీఎం చెప్పారు, మొత్తం ఏడు వందల ఎకరాలు పై చిలుకు టిటిడి ఉద్యోగులకు కేటాయింపు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి, వీటికి 80 కోట్లు కేటాయింపు చేశారు. విమర్శలు చేస్తున్నా మమ్మల్ని పడదోయాలనీ కుట్రలు చేసినా మేము కార్మికులు, అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉంటాం. బాధ్యతతో చేసిన పనే తప్ప , వేరే ఉద్దేశ్యం లేదు. శ్రామిక వర్గం పక్షాన నిలబడి ఈరోజు ఇళ్లు స్థలాలు కేటాయింపు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పోటు కార్మికులకు 10వేలు జీతం పెంచాం, వాహన బేరర్లు ను స్కిల్డ్ లేబర్ గా గుర్తింపు చేశాం. 415 ఎకరాలు పాధిరేడు అరణ్యం వద్ద టిటిడి ఉధ్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు. ఏర్పేడు వద్ద 350 రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు.






Total views : 90621