ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారన్న మాజీ సీఎం వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ ఆఫీసు నిర్మాణం విషయంలో హైకోర్టును ఆశ్రయించినా..స్థానిక ప్రభుత్వం అక్రమంగా కూల్చివేతకు పాల్పడుతున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూల్చివేతను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా..సీఆర్డీఏ అధికారులు మాత్రం ఆగమేఘాల మీద ఆ కట్టడాన్ని కూల్చివేశారని చెబుతున్నారు. బుల్డోజర్లతో సాయంతో కేవలం 2 గంటల వ్యవధిలోనే పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. తెల్లవారకముందే సీఆర్డీఏ ఆదేశాలను మున్సిపల్ ఆధికారులు అమలు చేశారు. గేట్లు మూసేసి మరీ పోలీసుల మోహరింపు మధ్య కూల్చివేశారు. సీఆర్డీయే అధికారులపై కోర్టును ఆశ్రయించినా..అవేమీ పట్టించుకోకుండా నోటీసులివ్వకుండా నిర్మాణాన్ని సీఆర్డీఏ కూల్చివేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారన్న మాజీ సీఎంచంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీసుకు వెళ్లే మార్గంలోనే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ ధిక్కరించిందని దీనిపై కోర్టుకు వెళ్లే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి