Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh జగన్ పులివెందుల పులి కాదు…పిల్లి!- వైఎస్ షర్మిలా రెడ్డి

జగన్ పులివెందుల పులి కాదు…పిల్లి!- వైఎస్ షర్మిలా రెడ్డి

by Prakash
YS Sharmila

వైఎస్ఆర్ కడప జిల్లా,

పులివెందుల(Pulivendhula) లో భారీ బహిరంగ సభ, సభలో పాల్గొన్న కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి, సునీతా రెడ్డి.

ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ.. ఒకవైపు హంతకుడు – YS Sharmila

కొంగు చాచి అడుగుతున్న…మీ ఆడ బిడ్డలం.. అడుగుతున్నాం…న్యాయం చేయండి… మీరే నిర్ణేతలు. ఒక వైపు న్యాయం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది. వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేకా(Y.S Viveka Reddy) హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో ప్రజలు తేల్చుకోవాలి. జగన్(Y.S JAGAN) పులివెందుల పులి కాదు…పిల్లి. బీజేపీకి బానిస లా మారిన పిల్లి- వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ & కడప పార్లమెంటు అభ్యర్థి…

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్భం గా వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila) మాట్లాడుతూ…

  • మేము వస్తున్నామని తెలిసి లైట్లు తీశారట
  • లైట్లు ఉండవు అంటే ముఖ్యమంత్రిగా జగన్(Y.S JAGAN) ఫెయిల్ అయినట్లు
  • లైట్లు కావాలని తీశారు తీశారు అంటే అవినాష్ రెడ్డికి భయం పట్టుకున్నట్లు..
  • వివేకా హత్య విషయంలో సునీతమ్మ ఎంతో బాధపడింది
  • న్యాయం జరగడం లేదని అవేదన పడింది
  • నేను జగన్ ఆన్న కోసం 3200km పాదయాత్ర చేశా
  • ఆన్న కోసం ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి తిరిగా
  • జగన్ ఆన్న ముఖ్యమంత్రి అయితే YSR సంక్షేమ పాలన వస్తుంది అనుకున్న
  • పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి అవుతాయి అనుకున్న
  • వైఎస్ఆర్ పథకాలు అన్ని అమలు అవుతాయి అనుకున్న
  • జగన్ ఆన్న కోసం ఏది చెప్తే అది చేశ
  • ఓదార్పు యాత్ర కూడా చేశ
  • జగన్ మోహన్ రెడ్డికి నేను ఒకప్పుడు చెల్లి కాదు ..బిడ్డను
  • కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మొత్తం మారిపోయాడు
  • ఈ మారిన జగన్(Y.S JAGAN) ను నేను ఎప్పుడు చూడలేదు
  • ఈ సీఎం జగన్ నాకు పరిచయం లేదు
  • వివేకా హత్య విషయంలో సునీత,చిన్నమ్మ బాగా నష్టపోయింది
  • వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న
  • సొంత రక్త సంబంధానికి న్యాయం చేయక పోతే మనం ఎందుకు ?
  • వైఎస్ వివేకా ఇక్కడే ఉంటారు
  • ఆయన గడప తొక్కని కుటుంభం ఈ పులివెందులలో లేనే లేదు
  • ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కారం చేసే వాడు
  • తన కార్లో తీసుకొని మరి అధికారుల దగ్గరకు వెళ్లే వాడు
  • ఇలాంటి నాయకుడిని దారుణంగా హత్య చేశారు
  • గొడ్డలి తో నరికి నరికి చంపేశారు
  • ఘోరంగా,క్రూరంగా చంపేశారు
  • ఈ రోజు వరకు న్యాయం జరగలేదు
  • జగన్ తన అధికారాన్ని అడ్డంగా పెట్టీ మరి హంతకులను కాపాడుతున్నారు
  • హంతకులను జగన్ వెనకేసుకు వస్తున్నాడు
  • CBI అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది
  • హత్య చేసింది అవినాష్ రెడ్డి కుటుంభం అని చెప్పింది
  • ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. గూగుల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పింది
  • హత్యకు ముందు డబ్బుల పంపిణీ కూడా జరిగింది
  • అన్ని ఆధారాలు ఉండి కూడా CBI అవినాష్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేక పోయింది
  • జనాలు జగన్ ను నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా ?
  • జగన్ పులివెందుల పులి కాదు.. పిల్లి
  • పిల్లిలా మారి బీజేపీ కి జగన్ బానిస అయ్యాడు
  • అధికారం ఇస్తే వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తా అని చెప్పాడు
  • అధికారంలో వచ్చిన 6 నెలల్లో పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తా అన్నాడు
  • 42 పెండింగ్ ప్రాజెక్ట్ లు ఉంటే… పట్టుమని 10 పూర్తి చేయలేక పోయాడు
  • పులివెందుల బిడ్డ… కనీసం ఒక రాజధాని కూడా కట్టలేక పోయాడు
  • 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని 4న్నర ఏళ్లుగా కోట లో నిద్ర పోయాడు
  • ఇప్పుడు కుంభకర్ణుడు లెక్క నిద్ర లేచి డీఎస్సీ అంటూ హడావిడి చేస్తున్నాడు
  • 5 ఏళ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు
  • మద్య నిషేధం అని చెప్పి మోసం చేశారు
  • నిషేదం పేరు చెప్పి అడ్డగోలుగా కల్తీ బ్రాండ్ అమ్ముతున్నారు
  • ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
  • అధికారం అడ్డుపెట్టుకొని… హత్యా రాజకీయాలకు అండగా ఉన్నాడు
  • 5 ఏళ్లు హంతకులను కాపాడాడు
  • మళ్ళీ ఆ నిందితులకు సీట్ ఇచ్చారు
  • ఇది అన్యాయం కాదా అని అడుగుతున్న
  • వివేకా హత్య కుటుంబ విషయమా ?
  • ఇది ఆస్తి సమస్య నా ?
  • ఇది ప్రజా నాయకుడు హత్య
  • న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం
  • న్యాయం అడగడం మేము చేసినా తప్పా ?
  • ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది
  • కొంగు చాచి అడుగుతున్న
  • మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం
  • న్యాయం చేయండి
  • మీరే నిర్ణేతలు
  • ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ.. ఒకవైపు హంతకుడు
  • ఒక వైపు న్యాయం ఉంది .ఒకవైపు ధర్మం ఉంది
  • వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో ప్రజలు తేల్చుకోవాలి
  • నేను వైఎస్ఆర్ బిడ్డను.
  • పులి కడుపున పులే పుడుతుంది.
  • వైఎస్ఆర్ బిడ్డ ఎవ్వరికీ భయపడేది కాదు
  • అన్యాయాన్ని సహించేది కాదు
  • హంతకుడు చట్టసభల్లో వెళ్ళొద్దని ఈ నిర్ణయం తీసుకున్న
  • నాలుగు రోజుల పర్యటనకే అవినాష్ రెడ్డిని మారుస్తున్నారట
  • అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని ప్రజలు నమ్ముతున్నారు
  • ఓడిపోతాడు అని నిర్ధారణకు వచ్చారు
  • ఓటమి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు
  • ఎందుకు మళ్ళీ సీట్ ఇచ్చారో… ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలి
  • పులివెందుల ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి
  • CBI విచారణ ఎందుకు వద్ధన్నారో సమాధానం చెప్పాలి.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి(Sunitha Reddy) మాట్లాడుతూ…

  • మార్చ్ 15 న పొద్దున్నే ఫోన్ వచ్చింది
  • నాన్న చనిపోయారు అని చెప్పింది
  • పోలీస్ పిర్యాదు చేయొద్దని చెప్పారు
  • పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఆపమని నేను చెప్పాను
  • నేను ఏరియా ఆసుపత్రిలో చూడగూడని దృశ్యాలు చూశా
  • తల నుంచి ఎముకలు,మెదడు బయటకు వచ్చాయి.
  • ఏమయ్యిందో అర్థం కాలేదు
  • పోలీసులు వస్తున్నారు.. పోతున్నారు
  • అసలు ఏం జరిగిందో తేల్చుకోలేక పోయాం
  • చనిపోయిన ఇంట్లో నన్ను ఉండకూడదు అన్నారు
  • కూతురు వి కదా ఉండొద్దు అన్నారు
  • నేను కూతురు అయినా, కొడుకు అయినా నేనే అని చెప్పా
  • ఎన్నికలు అయ్యే వరకు ఎవరు చేశారో తెలియలేదు
  • ఇంతలో ప్రభుత్వం మారింది
  • వైఎస్ జగన్ సిఎం గా ప్రమాణ స్వీకారం చేశారు
  • నేను జగన్ ను కలిశా
  • న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు
  • చీఫ్ మినిస్టర్ గా ఉండి దోషులకు శిక్ష వేయక పోతే నాకు అవమానం అన్నారు
  • అప్పుడు జగన్ అన్నను బాగా నమ్మాను
  • కేసు ఏటు తేలలేదు
  • అనుమానం వచ్చి CBI కి పోదాం అని చెప్పా
  • ఎప్పుడు జగన్ నన్ను వద్దు అని చెప్పారు
  • మనం CBI కి పోతే అవినాష్ రెడ్డి బీజేపీ కి పోతాడట అని చెప్పారు
  • అప్పుడే నిర్ణయం తీసుకున్న
  • కచ్చితంగా CBI కి వెళ్ళాలని…
  • కోర్టును ఆశ్రయించా
  • అప్పుడు కోర్టు ద్వారా న్యాయం CBI కి కేసు బదిలీ అయింది
  • CBI విచారణలో దారుణ విషయాలు తెలిశాయి.
  • వైఎస్ నీ చంపితే ఆయనకు కొడుకులు లేరు అనుకున్నారు
  • ఆన్న ఒక్క ఆడది ఏం చేస్తుంది లే అనుకున్నారు
  • ఆడది అంటే అబల కాదు… ఆది పరాశక్తి
  • ఇది న్యాయ పోరాటం
  • దోషులకు శిక్ష పడే పోరాటం
  • హత్య చేసిన వారికి శిక్ష పడాలి
  • షర్మిల ను గెలిపిస్తే నా గొంతుగా పార్లమెంట్ కి వెళ్తుంది
  • మన కష్టాలు అర్థం చేసుకుంటుంది
  • అందుకే ఇవ్వాళ మనం షర్మిల ను గెలిపించాలి
  • న్యాయం వైపు నేను షర్మిల ఉన్నాము
  • ధర్మం వైపు మేము నిలబడ్డాము
  • ప్రజలు ఏ వైపు ఉన్నారో అర్థం చేసుకోవాలి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జగన్ పులివెందుల పులి కాదు…పిల్లి!- వైఎస్ షర్మిలా రెడ్డి
Advertisements

You may also like

Our Visitor

019465
Total views : 90764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.