ఈనెల 3వ తేదీన ఏలూరు నేషనల్ హైవే పక్కన ఆశ్రమం ఆసుపత్రి సమీపంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి బహిరంగ సభకు మూడు లక్షల మందికిపైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్ళిస్తున్నట్లు చెప్పారు. వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దేవరపల్లి వద్ద మళ్ళిస్తున్నట్లు వెల్లడించారు.. అదేవిధంగా వైజాగ్ నుండి విజయవాడ చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి జంక్షన్ వద్ద మళ్లిస్తున్నట్లు తెలిపారు.. వీటితోపాటు నెల్లూరు నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను ఒంగోలు వద్ద మళ్ళిస్తున్నట్లు వెల్లడించారు.
ysrcp
విజయనగరం జిల్లా, ఎస్.కోట లో వైసీపీలో ముసలం.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు..అంటూ అసమ్మతి నేతల నిరసన.. శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలంలో శ్రావణి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం సమావేశం. శృంగవరపుకోట నియోజకవర్గం లో ఐదు మండలాల లో ఉన్న ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,సర్పంచ్ లు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును మార్చాలని స్థానిక నాయకులకు టిక్కెటు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో స్థానికులకు టికెట్ కేటాయించకుండా మళ్ళీ కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అందుకని స్థానికులకి అవకాశం ఇవ్వాలని అందరూ నాయకులు ముక్తకంఠంతో కోరారు. మా మాట వినకుండా టికెట్ ఇస్తే ముకుమ్ముడు అందరం పార్టీకి రాజీనామాలకు సిద్ధమని తెలిపారు. ఎల్ కోట సీనియర్ నాయకులు సూర్యారావు మాట్లాడుతూ.. మాకు స్థానికుడు తప్ప ఈ ఎన్.ఆర్.ఐ లు మనకి వద్దు కచ్చితంగా అభ్యర్థిని మార్చకపోతే అందరం ముకుమ్ముడి రాజీనామాకైనా సిద్ధం అని ముఖ్తకంఠంతో తెలిపారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా గురజాలలో 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజు తో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాల్ సంభాషణ సీవీఆర్ న్యూస్ లో ప్రచురించడంతో వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నేను ఎవరిని బెదిరించలేదు, మందలించాను అంతే అని ఎమ్మెల్యే కాసు తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసి వెళ్లిపోయారు అది తప్పేం కాదని, మీరు పోవాలంటే పోండి కానీ రాజీనామా చేసి వెళ్ళండి అది ఏవరైనా కానీ అని స్పష్టం చేశారు. ఒక్కడు పార్టీ నుంచి వెళ్తే 10 మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని అని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం లో ఆసక్తికరం గా మారిన వైసీపీ నేతల వరుస ఆత్మీయ సమావేశాలు. జగ్గంపేట కొత్త ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చాక, స్థానిక వైసీపీ నేతలతో సమన్వయం లేకపోవడంతో కేడర్ లో అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు. మరో పక్క నియోజకవర్గం లో రోజు రోజుకు టీడీపీ లోకి పార్టీ కండువాలతో తమ వైపు మార్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైసీపీ ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చినప్పటికీ టీడీపీ లోకి కేడర్ మారిపోతుండడంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నామంతున్న నియోజకవర్గ వైసీపీ నేతలు. మరోపక్క ఎమ్మెల్యే గా ఉన్న జ్యోతుల చంటిబాబు కు మళ్ళీ వైసీపీ లో ఇంటిలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ల ద్వారా మళ్ళీ అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలతో చంటిబాబు అనుచరుల్లో నూతన ఉత్సాహంగా కలిసి పనిచేస్తామంటున్న స్థానిక నేతలు. నియోజకవర్గ పరిధిలోని మండల కేడర్ నేతలతో ఆత్మీయ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో అనూహ్య గా మారుతున్న రాజకీయం. చంటిబాబు కు మళ్ళీ అవకాశాలు ఉన్నాయని పుకార్లు తో వైసీపీ లో ఇంచార్జ్ గా ఉన్న నేతల మధ్య, టిడిపి నేతలు మధ్య మొదలైన గుబులు. గోకవరం లో స్థానిక జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ నివాసం వద్ద తన అనుచరులతో చంటిబాబు వర్గం కార్యకర్తలు తో అత్యవసర భేటి.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం ఆకునూరు లో వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ది పొందిన 3296 మందికి రూ.3.12 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆసరా ను మహిళలు పండగలా జరుపుకుంటున్నారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. అవ్వా తాతలకు గడప వద్దకే పెన్షన్ అందిస్తున్నాం. 2019 లో ఇచ్చిన అన్ని హామీలు జగన్ అమలు చేశారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి .. కట్టిస్తున్నాం. జగన్ చెప్పాడంటే… చేస్తాడంతే.. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయి. విద్య కు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరు. ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని అన్నారు.
రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా చెప్పుకోవచ్చు. అత్యధికంగా సామాజిక వర్గంగా కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ భిన్నమైన తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2014లో ఇండిపెండెంట్ గా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ విజయం సాధించారు. ఏకంగా 50 వేల ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. 2019 లో మాత్రం జగన్ గాలికి ఆయన కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం జనసేన టిడిపి బలంగా ఉన్న వర్గాల్లో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెప్పాలి అయితే ఇక్కడ వర్మ సీటు ఆశిస్తున్నారు. కానీ జనసేనకు పిఠాపురం తప్పనిసరి అని వాదన బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానికత అంశం కూడా తెరపైకి రావడం రాజకీయంగా కలవరం సృష్టిస్తుంది. ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా ఉన్న ఉదయ శ్రీనివాస్ రాజమండ్రి దగ్గర కడియంకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని జనసేన నాయకుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దేందుకు మాత్రమే ఉదయ్ శ్రీనివాసన్ పంపించారనేది మరొక వాదన అయితే ఉదయ శ్రీనివాస్ కు సీటు పక్కా అని పవన్ కళ్యాణ్ ఇంట్లో మనిషిగా ఉదయ శ్రీనివాస్ కు పేరు ఉందని ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పిఠాపురం ప్రత్యేక స్థానంలో ఉంది. ఇందుకు గతంలో తెలుగుదేశానికి పడ్డ ఓట్లే ఉదాహరణగా చెబుతున్నారు. జనసేన బలంగా ఉన్నప్పటికీ లోకల్ ఫీలింగ్ బయటకు రావడంతో ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఇక్కడ సీటును తెలుగుదేశానికి కేటాయించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క అధిష్టానం కూడా ఎటు తేల్చకపోవడంతో ఈ సీటు ప్రస్తుతం గందరగోళ పరిస్థితిని నెలకొల్పిందనే చెప్పాలి. ఆఖరి నిమిషం వరకు పిఠాపురం సీటు తేల్చాలని ప్రతిసారి ఇలాగే చేసి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఆయా పార్టీల అభిమానులు ఎవరో ఒకరికి సీటు వస్తుందని పక్కాగా చెబితే ఆ దిశగా మేము కార్యక్రమాలు చేస్తామని అప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదని జనసేన టిడిపి కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క వైసీపీ ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దొరబాబును పక్కనపెట్టి కాకినాడ ఎంపీ వంగ గీతకు ఇన్చార్జ్ పగ్గాలు అప్పగించారు. పిఠాపురం సీటు విషయంలో ఎమ్మెల్యే మరో దారి లేక పార్టీ వెంటే ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం రాజకీయ పరిస్థితి చూస్తే జనసేన టిడిపి పోటాపోటీగా సీటు కోసం పాకులాడుతున్నాయి. మరోపక్క పిఠాపురం స్థానం నుండి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే ఎవరికీ గొడవ ఉండదని నెగ్గించుకుంటామని టిడిపి జనసేన అభిమానులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పిఠాపురం సీటు విషయంలో చివరి వరకు డైలమా తప్పదని ఇది గతం నుండి ఆనవాయితీగా వస్తుందని స్థానికులు అంటున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంగాను, రాజకీయ దురందుల కోటగాను పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మెట్ట ప్రాంతంలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. తాజాగా మారుతున్న కాలాన్ని బట్టి పెరుగుతున్న రాజకీయ పార్టీల తాకిడితో మెట్ట ప్రాంతమైన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట లో రాజకీయం రసవత్తరంగా మారింది. CVR న్యూస్ ప్రత్యేక కథనం మెట్ట ప్రాంతంగా పిలవబడే జగ్గంపేటలో ఆది నుంచి పంతం, తోట, జ్యోతుల కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. ఈ మూడు కుటుంబాలకు ఉభయగోదావరి జిల్లాలోని అన్ని పార్టీల నాయకులతో కుటుంబ బాంధవ్యాలు పెనవేసుకుని ఉన్నాయి. దీనితో రాజకీయంగా ప్రధాన పార్టీలు ఆయా కుటుంబాలను కాదని గత ఐదు దశాబ్దాలుగా మరొకరికి ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. తాజాగా కొత్త పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయా కుటుంబాలకు దగ్గర బంధువులే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.
జగ్గంపేట రాజకీయం ఒక చిత్రం పరిశీలిస్తే ప్రస్తుత శాసనసభ్యుడిగా వైకాపా నుంచి జ్యోతుల చంటిబాబు ఎన్నికయ్యారు. ఈయన రాజకీయ దురంధరుడు గా పేరుగాంచిన తన పెదనాన్న జ్యోతుల నెహ్రూ పై పోటీ చేసి గెలుపొందారు. మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఆరితేరిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట సెగ్మెంట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇబ్బడి ముబ్బడి సంక్షేమ పథకాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగనన్న పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విధంగా జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబునీ కాదని అధికార వైసిపి మాజీ మంత్రి తోట నరసింహంను జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. ఆయన పాత క్యాడర్ ను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని పటిష్టవంతం చేసే చర్యల్లో ఆయన తనదైన శైలిలో పావులు కదుపుతూ ముందుకు పోతున్నారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన కొంత క్యాడర్ మాత్రం ఎటువైపు వెళ్లకుండా గుంభనంగా ఉన్నారు. అధికార వైసిపి టికెట్ జ్యోతుల చంటి బాబు కాదని మాజీ మంత్రి తోట నరసింహం పేరు ప్రకటించగానే పార్టీలో అసంతృప్తులు పెరిగాయనే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా నియోజకవర్గ పరిధిలో వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు జోరుగానే సాగుతున్నాయి. కిర్లంపూడి ఎంపిపి,జెడ్పీటీసీ, గండేపల్లి జెడ్పీటీసీ, గోకవరం ఎంపిపి లు తమ అనుచర వర్గంతో వైసిపి నీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీటికి తోడు గ్రామస్థాయిలో కూడా టిడిపి నేత జ్యోతుల నెహ్రూ పార్టీలో చేరికలు జోరుగా సాగిస్తూ తన మార్క్ రాజకీయాలు సాగిస్తూ బలం పుంజుకుంటున్నారు.
నియోజకవర్గ స్థాయిలో వైసిపి నుండి టిడిపి లోకి జోరుగా చేరికలు పెరగడంతో అధికార వైసిపి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసంతృప్త వాదులను పార్టీలోకి తీసుకుని బలం పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి తోడు పార్టీకి దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబును సైతం దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు అధిష్ఠానం చేపట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయన కాకినాడ ఎంపిగా జనసేన పార్టీ తరుపున బరిలోకి దిగనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. పొత్తులో బాగంగా బరిలోకి జ్యోతుల కుటుంబాలు కలిసి దిగితే అధికార వైసిపి ఓటు బ్యాంక్ గండి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు పార్టీలకు సమాంతరంగా జనసేన పార్టీ జగ్గంపేట ఇన్చార్జి పాఠం శెట్టి సూర్యచంద్ర గత ఏడాదికాలంగా తన భార్యతో కలిసి ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఒక దఫా మొక్కల పంపిణీ అంటూ మరో దఫా పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు పంపిణీ చేస్తూ నిత్యం ప్రజల్లోనే పర్యటిస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. పొత్తు లో భాగంగా జగ్గంపేట టికెట్ టిడిపికి కేటాయిస్తే సూర్యచంద్ర పయనం ఎటు అనే విషయం ఆలోచింప చేస్తుంది. అధికార వైసిపి లో ఉన్న లుకలుకలు మాదిరిగానే పొత్తు కుదిరితే జనసేన లోను లుకలుకలు బహిర్గతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఐదో లిస్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు. 4 ఎంపీ స్థానాలైన కాకినాడ, మచిలీపట్నం, నరసరావుపేట, తిరుపతిలో అభ్యర్థులను వైసీపీ అధిష్ఠానం మార్పు చేస్తూ కొత్త లిస్ట్‌ను విడుదల చేసింది. కాకినాడ ఎంపీ స్థానంలో చలమలశెట్టి సునీల్, మచిలీపట్నంలో సింహాద్రి రమేశ్ బాబు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పోటీ చేస్తారని తెలిపారు. ఇక ఈ 4 ఎంపీ స్థానాలే కాకుండా మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను మార్చుతూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో అరకు, సత్యవేడు, అవనిగడ్డ స్థానాలు ఉన్నాయి. అరకు అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొడ్డేటి మాధవిని మార్చుతూ ఆ సీటును రేగం మత్య్స లింగంకు కేటాయించారు. ఇక సత్యవేడులో నూకతోటి రాజేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు పోటీ చేస్తారని బొత్స తెలిపారు.
అనర్హత పిటిషన్ల వ్యవహారంలో వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ స్పీకర్ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ నోటీసులకు స్పందించాలని స్పీకర్ కార్యాలయం కోరింది. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ అయిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజులకు నోటీసులు పంపించారు. ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి స్పీకర్ తమ్మినేని విచారణ చేయనున్నారు. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్న తర్వాతే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోటబొమ్మాలి ఇండియన్ బ్యాంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న వైఎస్ఆర్సిపి సిద్ధం సభకు వెళ్తుండగా ఆపశృతి చోటుచేసుకుంది. కోటబొమ్మాలి మండలం కొసాల పురం గ్రామానికి చెందిన ఉప్పాడ లక్ష్మణరావు(48) ప్రైవేట్ బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న బస్సు నుండి కాలుజారి అదే బస్సు చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.