ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఆయనపై కరుడుగట్టిన అభిమానుల్లో కూడా వ్యతిరేకత మొదలైంది. కడప నగరంలో వైసిపీ కి జనం మాత్రమే కాదు… సొంత బ్యాచ్ వ్యతిరేకంగా మారుతున్నారు. ఒకరిద్దరు కాదు 22 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడే యోవచనలో ఉన్నారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఓ ముఖ్య నేత తమకు కనీసపాటి విలువ ఇవ్వకపోవడం… ప్రభుత్వ తీరుతో జనంలో తమ పట్ల వ్యతిరేకత పెరగడంతో కార్పొరేటర్లు ఆందోళన చెందుతున్నారు. వీరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతుండటంతో కడప రాజకీయాలు కాకరేపుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జమానా నుంచి వారి కుటుంబాన్ని కడప అక్కున చేర్చుకుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో కడపపై తన మార్పు చూపించుకున్నారు. మున్సిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్ గా మార్చారు. 2005 తర్వాత వరుసగా అప్పట్లో కాంగ్రెస్ తర్వాత వైసీపీనే కడప మేయర్ పదవి చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కార్పొరేటర్లు అంతా కాంగ్రెస్ కు బై చెప్పి వైసీపీ గూటికి చేరారు. 2014-19 ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించారు. కడప కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉండగా…వీరిలో ఒకరు టిడిపి..మరొకరు ఇండిపెండెంట్ గా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుస్తుంది అనే పాజిటివ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయింది. ఈసారి టిడిపి వస్తుందనే నమ్మకం వైసీపీ వీరాభిమానుల్లోను బలబడింది. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్న కార్పొరేటర్లు ఒక అంచనాకు వచ్చారు. ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అనే నిర్ణయానికి వచ్చారు. దీంతో కొందరు వైసీపీ కార్పొరేటర్లు టిడిపి నాయకులతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ysrcp
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని.. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని సీఎం జగన్కు వివరించినట్లు తెలిపారు. రాజకీయాల్లో విసిగిపోయానన్నారు. పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారని.. అయితే పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎంకు చెప్పానన్నారు. అయితే అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తానని.. ప్రజలు వద్దనుకుంటే పోటీ చేయానని మంత్రి ధర్మాన తేల్చి చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ..బీసీలకు జగన్మోహన్రెడ్డి వెన్నుపోటు పొడిచి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని అన్నారు. తాను ప్రభుత్వంపై పొరాడుతుంటే తనపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ హయంలో బీసీలకు పెద్దపీట వేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ నిర్చయించుకుందని తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం మామిడిగుంట గ్రామంలో అశ్లీల నృత్య ప్రదర్శనలు. వైసిపి నాయకుల కనుసన్నల్లో ఐదుగురు యువతులతో తెల్లవారు జామున వరకు సాగిన అశ్లీల నృత్యాలు. ద్రాక్షారామ పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో బహిరంగంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు జరిగినా ద్రాక్షారామ ఎస్ ఐ ఏమాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కేశినేని చిన్ని. ఎంపీ కేసినేని నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేశినేని చిన్ని. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడుగా మారాడు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుక నాని అటు తిరుగుతున్నాడు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టిడిపిని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదు. కొడాలి నానిలా బూతులు మాట్లాడుతూ కేశినేని నాని తయారయ్యాడు. మేము గేట్లు తెరిస్తే వరదలా రావడానికి వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారు. దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యం.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలంలో ని అన్ని గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, శ్రేణులను కలిసి 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 లో గెలిచేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి అని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము ప్రతిపక్షాలకు లేదు అని, ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చిన భయపడే ప్రసక్తి లేదని ప్రజల గుండెల్లో మేము స్థానం సంపాదించుకున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం లో 2019 ఎన్నికల్లో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచి పెనమలూరు గడ్డపై వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
విజయవాడ, బుద్ధ వెంకన్న, ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా, బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని, 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా ? కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా ? కే అంటే కేశినేని కాదు… కోవర్టు. మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని. ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు. దొంగ రశీదు బుక్కులు తయారు చేయించి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన కోవర్టు నాని. వంద రూపాయల బస్సు టికెట్టు 500 కు అమ్మాడు కోవర్టు నాని. ఒకే నంబరు ప్లేటు మీద బస్సులు తిప్పిన కోవర్టు నాని. భూకబ్జాలకు విజయవాడ నగరంలో పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కోవర్టు నాని
చంద్రబాబు కేశినేని నానిని మెడబట్టి గెంటాడు అనేది నిజం. బాలయోగి ఆస్తులు కాజేసింది కేశినేని నాని అని చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు. దళిత వ్యక్తి ఆస్తులు కాజేసి ఏ మోహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళావు నాని. బాలయొగి ఆస్తులు ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు.. కేశినేని నాని ఊహల్లో బ్రతికే వ్యక్తి కనుకనే చంద్రబాబు స్ధాయి అని చెప్పుకుంటాడు. లోకేష్ గెడ్డంలో నెరిసిన వెంట్రుక స్ధాయి కాదు కేశినేని నానిది. కేశినేని నాని వెనుక నందిగామలో పదిమంది లేరు. కేశినేని నాని టిడిపి వీడితే పది మంది లేరు అతని వెనుక ఎన్నికల తరువాత వైసీపీ కేశినేని నాని సహా ఖాళీ అయిపొతుంది. ఉల్లిపాయ బాంబులు పేలితే పారిపోయే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాల్ మనీ అంటావు.. అంటే ఏంటో చెప్పు.. చర్చిద్దాం.. నీ బ్రతుకే అప్పులు ఎగ్గొట్టే బ్రతుకు. చంద్రబాబు ఈ జిల్లాలో చేసిన పోరపాటు ఈ కోవర్టును ఎంపీ చేయడం. చంద్రబాబు అమాయకత్వం, మంచితనంతో వదిలేసాడు.. జగన్ అయితే నాని ని కొట్టి పంపిస్తాడు. దాదాపు 9 కోట్ల రూపాయల చందాలు 2019లో వసూలు చేసాడు కేశినేని నాని. ఎన్ని రకాల అవలక్షణాలు ఉంటే.. అన్నీ ఉన్న వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని కొవ్వు కరిగిస్తాం. లోకేష్, చంద్రబాబు లను మర్యాదపూర్వకంగా కలిసాను. వెస్ట్ ఇంఛార్జ్ నేనేమీ అడగలేదు. కోఆర్డినేటర్ కూడా బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నాడు కేశినేని నాని. చంద్రబాబు కుటుంబానికి విధేయుడుగా ఉంటాను. చంద్రబాబు కుటుంబానికి మా కుటుంబం అంకితం. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి తెరపడింది. అన్న వదిలిన బాణం షర్మిల… ఇప్పుడు రివర్స్ అయింది…
విజయవాడ, కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. కోడి కత్తి శీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులు. కోడికత్తి శీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించిన పోలీసులు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీబు ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయిన నిరసనకారులు. వెంటనే స్పందించి అతని వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను విజయవాడ హాస్పటల్ తరలించిన పోలీసులు.
ఉరవకొండ, ఈనెల 23న ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి, ఎస్పీ అన్బురా జన్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణం లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. 7,876 లక్షల మంది మహిళలకు రూ.6,379 కోట్ల ఆసరా మొత్తాన్ని సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు. ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ సీఈఓ వైభోమ్ నిదియాదేవి, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, స్థానిక తహసీల్దారు శ్రీధరమూర్తి పాల్గొన్నారు.