మాజీ మంత్రి బొత్స పై విజయవాడలో ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతోపాటు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఏసీబీకిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీదు ఇచ్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీచర్ల వద్ద నుంచి 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు ముడుపులు ముట్టాయని తెలిపారు. సుమారు 65 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బొత్స హయాంలో జరిగినంత మోసం ఎప్పుడూ ఎక్కడా జరగలేదన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక టీచర్ల బదిలీలు చేశారని మండిపడ్డారు. 1600 నుంచి 2500 మంది టీచర్లు మంత్రి, పేషీ ఘనాపాటీలపై దాడికి సిద్ధంగా ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగోతమంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తోందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90748