ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విషయంలో తెలంగాణ హైకోర్టు కన్నెర్ర చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతోంది.అన్నదాతల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గత ఏడాది హైకోర్టులో విచారణ జరిగింది. పరిహారం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని నాడు ప్రభుత్వం పేర్కొంది. నాలుగు నెలల్లో చెల్లిస్తామని అప్పట్లో అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. ఏడాది దాటినప్పటికీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. దీనిపై కొండల్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు దిక్కరణ కింద ఎందుకు స్వీకరించకూడదో చెప్పాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు అధికారుల్లో వణుకు మొదలైంది. ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వివరాల సేకరణ పనిలో పడ్డారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి