నిరుద్యోగుల విషయంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. జీవో నెంబర్ 46 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్ధర్మచౌక్ వద్ద నిరుద్యోగుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నిరుద్యోగుల ధర్నాకు ఎంపీ ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….9వేల 2వందల పది గురుకులాలలో ప్రభుత్వం సంపూర్ణ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కువమంది విద్యార్థులు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారని తెలిపారు. గ్రూపులో 2లో రెండు వేల ఉద్యోగాలను పెంచాలన్నారు. అంతేకాకుండా గ్రూప్ 1 లో పేపర్ రెండు సార్లు రద్దయి ఎంతో గందరగోళం అయినందున 1:100 గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ లో 25 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తామని హామీ ఇచ్చిందని కృష్ణయ్య గుర్తు చేశారు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 195980