మానవత్వం మంట కలిసి పోతుంది మాటలు నేర్చిన మనిషే తప్పులు చేస్తుంటే మాటరాని ముగజీవాలు తప్పులు చేస్తున్నాయని వాటిని బంధించి, చావు దెబ్బలు కొట్టి పైగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అట్టెం మధు అనే వ్యక్తికి చెందిన ఎద్దు కత్తెరసాల గ్రామంలో ఓ పంట చేనులో మేసింది. ఆ పంట యజమాని అయిన సర్ధార్ ఆ ఎద్దుని నిర్బంధించి చావు దెబ్బలు కొట్టి తన వద్దే ఉంచుకున్నాడు. అది వ్యతిరేకించిన యజమాని మధు మూగ జీవాన్ని ఎలా నిర్బంధిస్తావని హెచ్చరించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సర్దార్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. మూగ జీవాన్ని స్టేషన్ లో అప్పగించిన సర్దార్ పై చర్యలు తీసుకోవాలని యజమాని డిమాండ్ చేసాడు. ఆ మూగ జీవాన్ని చూసిన పలువురు ముక్కున వేలేసుకొని ఎద్దు పంచాయితీ స్టేషన్ వరకు చేరిందా అని చర్చ సాగిస్తున్నారు.
Adilabad
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో డిశంబర్ 27న సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో 39,748 మంది సింగరేణి కార్మికులకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించబోతున్న సింగరేణి కాలరీస్ కంపెనీ (sccl) యాజమాన్యం. సింగరేణి కొల్ బెల్ట్ ఏరియాలో మందమర్రి డివిజన్ లొ 11 పోలింగ్ బూత్‌లను ఖరారు చేసారు. మందమర్రి డివిజన్ లొ 5,300 మంది కార్మికులు ఉన్నారు. మందమర్రి మండలంలో డిశంబర్ 27న జరగబోయే ఎన్నికల పోలింగ్ బూత్ లలొ ఓటు హక్కు వినియోగించుకొనున్న సింగరేణి కార్మికులు. సింగరేణి ఎన్నికల కోసం బూత్ ప్రక్రియ ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి అధికారులు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగును. అదే రోజు సాయంత్రం మందమర్రి (CER CLAB) సీఈఆర్ క్లబ్ కౌంటింగ్ కేంద్రంలొ 6 గంటల నుంచి ఓట్లు కౌంటింగ్ చేసే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో, ఏఐటీయూసీ,(చుక్క) టీబిజికేఎస్, (బాణం ) ఐఎన్టియూసీ,(గడియారం ) గుర్తు లతో మరియు CITU, HMS, BMS,TNTUC, IFTU, జాతీయ ప్రాంతీయ యూనియన్ సంఘల నాయకులు ఈ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ప్రచారం ఉదృతం చేస్తున్న పలు యూనియన్ నాయకులు.
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుశపూర్ అటవీ ప్రాంతంలో గులాబ్ అనే పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది. మండలంలోని వంజిరి గ్రామానికి చెందిన గులాబ్ ప్రతిరోజు మాదిరిగానే పశువులను అంకుశపూర్ అటవీ ప్రాంతంలో మేపుతుండగా వెనక నుంచి వచ్చిన పెద్దపులి ఆకస్మాత్తుగా అతనిపై దాడికి దిగినట్టు బాధితుడు తెలిపాడు. వెంటనే తేరుకొని కర్ర ను చేత పట్టగానే పారి పోయిందని కాపరి తెలిపాడు. సమీపంలోని రోడ్డు వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను స్థానికులకు తెలుపడం తో కాపారిని ఆసుపత్రికి తరలించరు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు గాయలైన కాపారికి వైద్యంన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి ఏమి లేదని వైద్యులు నిర్దారించారు.
నస్పుర్ పట్టణంలోని కలెక్టరేట్ కు సమీపంలోని 42 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి లో నిర్మించిన అక్రమ కట్టడాలను పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా కూల్చివేశారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎక్స్కావేటర్లతో చేరుకుని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో నిర్మాణదారులు అడ్డుపడి ఆందోళన చేపట్టారు. రాత్రికి రాత్రే ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం తో కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేశారు. అధికారులు కొందరు రియాల్ టర్లు ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములలో దర్జాగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి వాహనాలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ తాసిల్దార్ వనజ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, నస్పూర్ సిఐ సంజీవ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
తమ నివాస ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చెయ్యడం వల్ల ఇబ్బందులు తలేతున్నాయని ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు.
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం పంచశీల నగర్ ప్రాంతంలో మద్యం షాపు నిర్వహించడం వల్ల పలువురు మద్యం సేవించడానికి వచ్చి అసభ్యకరంగ ప్రవర్తిస్తున్నారని వెంటనే తమ నివాస ప్రాంతం నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లో కార్తీక మాస శుద్ద పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మందమర్రి మూడవ జోన్ రామాలయంలో ఘనంగా కార్తీకమాస దిపోత్సవం జరిగింది. kk5 మైన్ కార్మికుల మేనేజర్ ఆధ్వర్యంలో రామాలయం ‘కమిటీ పర్యవేక్షణ లో ప్రవక్త శ్రీ శ్రీ రామచంద్ర పండితుల శ్రీనివాస కల్యాణ మహోత్సవం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీనివాసా కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లలో కార్తీక మాస దీపోత్సవం, శ్రీనివాస కళ్యాణం, మహా రుద్రాభిషేక మహోత్సవం వేదపండితులతో ఘనంగా జరిపారు. ఈ కార్తీక దీపోత్సవానికి పాల్గొన్న, పట్టణ మహిళలు ప్రజలు నాయకులు, సింగరేణి అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు, కార్తీక దిపోత్సవం లో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవల పథకాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద పడకల హాస్పిటల్ లో రిబ్బన్ కట్ చేశాడు. ప్రమాణ స్వీకారం అనంతరం గడ్డం వినోద్ నియోజవర్గం లో మొదటి పర్యటన సందర్బంగా భారీగా నాయకులు, కార్యకర్తలు శాలువాలతో, పూలమాలాలు వేసి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల తన పై విశ్వాసం తో గెల్పించారని.. బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నీశలు కృషి చేస్తా అని తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ. బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రత్యేక్షంగా ఉన్న వారు చూస్తుండగానే బైక్ నుండి మంటలు వ్యాపించి క్షణాల్లోనే బూడిద అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలనికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు. సజీవ దహనమైనా వ్యక్తి ఎవరు అనే కోణం లో పోలీస్ లు ధర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి పూర్తిగా కాలిపోవడం తో వివరాలు తెలియరాలేదు. పోలీస్ లు ధర్యాప్తు ను కొనసాగిస్తున్నారు.
కొమురం భీం జిల్లా అసిఫాబాద్ మండల బూరుగుడా గ్రామ సమీపంలోని, గిరిజన మహిళ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని హాస్టల్ నుండి దాదాపు 2 నుండీ 3 కిలోమీటర్ల పరుగులు తిస్తు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ తమపై దురుసుగా ప్రవర్తిస్తుందని, తమతో అసభ్యకరంగా మాట్లాడుతుందని ఆరోపించారు.
శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మొదటిసారిగా మందమర్రి పట్టణం పర్యటనలో భాగంగా సింగరేణి intuc యూనియన్ కార్యాలయం కి విచ్చేశారు. ఐఎన్టీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. నాపై నమ్మకంతో అధిక మెజార్టీతో గెలిపించిన మందమర్రి ప్రజలకు యూనియన్ నాయకులకు నా ధన్యవాదములు సింగరేణిలో డిసెంబర్ 27 న జరుగబోయే ఎన్నికలకు intuc యూనియన్ కూడా గెలుపుకు కృషి చేస్తే intuc నాయకులకు సింగరేణి కార్మికులకు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి intuc యూనియన్ నాయకులు ఘనంగా సన్మానం చేసి వారికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రజారాజ్యమనే నినాదంతో ముందుకు సాగుతున్నారని సీఎంగా పదవి చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీ ల మీద సంతకం చేశారని సింగరేణి కార్మికుల సమస్యల హక్కు లఫై పోరాటం చేసి సమస్య పరిష్కారం చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమం లొ INTUC యూనియన్ నాయకులు కంపల్లి సమ్మయ్య, బుమయ్య, మిట్ట సూర్య నారాయణ, అన్ని మైన్ల పిట్ సెక్రటరీ కార్మికులు పాల్గొన్నారు.




Total views : 196493