సర్కారు బడి సిబ్బంది, ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం.. ఆరేళ్ల చిన్నారిని తాళం వేసున్న తరగతి గదిలోనే ఆరు గంటలపాటు భయం భయంగా గడిపేలా చేసింది.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికంగా నివాసముండే ప్రభావతి సుబ్రహ్మణ్యం దంపతుల కుమార్తె ఒకటో తరగతి. గురువారం సాయంత్రం పాఠశాల ముగిశాక పిల్లలందరూ వెళ్లిపోయారు. కానీ ఆ చిన్నారి బెంచి పై పడుకొని ఉంది. గమనించని సిబ్బంది తరగతి గదికి తాళం వేసి వెళ్ళిపోయారు. రోజు సమయానికి ఇంటికి వచ్చే పాప ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పాఠశాల దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో గదిలో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఆమె కనిపించింది. సిబ్బంది కోసం వెతికినా అక్కడ లేకపోవడంతో.. తలుపులు బద్దలు కొట్టి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చిన్నరి తల్లిదండ్రులు వాపోయారు. ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ ఆంజనేయులు పేర్కొన్నారు.
Hyderabad
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మారేడుపల్లి కాలనీలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలను జరిగిన అవకతవకలను సాక్షాదారులతో సహా బయటపెట్టిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయకుండా లక్షల రూపాయల మధ్యవర్తులతో దండుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే స్వర్గీయ సాయన్న కూతుర్లు ఎంత అవినీతికి పాల్పడ్డారని ఈ దుస్థితి తీసుకువచ్చి రోడ్డున పడేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయమని కుండ బద్దలు కొట్టిన స్థానిక ప్రజానీకం రోజు కూలికి పోతేనే పుట్ట గడిచే పరిస్థితులలో ఉన్న మా పొట్ట కొట్టి లక్షల రూపాయలు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని వసూలు చేసిన వారితో పాటు డబ్బులు ఇచ్చిన వారికే డబల్ బెడ్రూంలు మంజూరయ్యాయని అంతేకాకుండా ఇచ్చిన వారికి కూడా ఎటువంటి సదుపాయాలు లేకుండా మంచినీటికి కానీ లిఫ్ట్ కానీ పనిచేయకపోవడం స్థానిక ప్రజానీకం ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. మీకు అండగా నేనున్నానంటూ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ వారికి చేయూతనిచ్చారు. జరిగిన అన్యాయము అక్రమాలను సాక్షాదారాలతో అధికారులకు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని వారు అన్నారు.
జనాభాలో సగం భాగం ఉన్న బలహీన వర్గాల వారి కోసం ఈ మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపరిచామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టీ విక్రమార్క అన్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ తెచ్చిన భూ సంస్కరణల వల్ల పేదలకు దక్కిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి వారికి ఇస్తామని స్పష్టమైన హామీని మెనిఫెస్టోలో ఇచ్చామన్నారు. ప్రజలకు సంపదను ఎలా పంచాలో మేనిఫెస్టోలో పొందుపరచటం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే అంశమన్నారు భట్టీ..
మహేశ్వరం బీజెపి పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సరూర్ నగర్ డివిజన్ లో పార్టీ నాయకుల తో కలసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలి అని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందెల శ్రీరాములు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అందెల శ్రీరాములు తెలిపారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకం అంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. లోకల్ వ్యక్తిగా, మహేశ్వరం నియోజకవర్గం లో సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తున్నారని శ్రీరాములు అన్నారు
కూకట్ పల్లి నియోజకవర్గంలోని చాకలి బస్తి, బుడగ జంగం బస్తి, సంగీత్ నగర్ లలో డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు. కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు , డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్జీ డిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ లో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ రాజకీయ పార్టీకి చెందిన లక్ష రూపాయల నగదును 5000వేల చొప్పున కవర్ లో పెట్టీ తరలిస్తున్న అఖిల్ అనే వ్యక్తి ని బాలనగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి సమ్మక్క సారక్క క్రషర్ లో ఉద్యోగి గా గుర్తించారు. అనంతరం జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా కార్యకర్తలను సమీకరించిన బిఅర్ఎస్ పార్టీ. అల్లపుర్ ,మూసాపెట్ , KPHB,బాలానగర్ మీదుగా రోడ్ షో.. రొడ్ షోలో పాల్గొన్న స్తానిక ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు,స్థానిక కార్పొరేటర్లు Kphb లో కాంగ్రెస్ పార్టీ సీనయర్ నేత గొట్టుముక్కల పద్మారావు కెటిఆర్ అధ్వర్యంలో చేరిక మాధవరం కృష్ణ రావు కాబోయే ఎమ్మెల్యే..9 ఏళ్లలో మేము పని చేసింది ఆరున్నర సంత్సరలు మాత్రమే, కరొన తో కొంత కాలం పోయింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది .. ఏక్కడి ప్రాంతం వారైనా మాకు సమానమే కులం ,ప్రాంతం పేరుతో కేసీఅర్ ఎనాడు చూడలేదు ,పెట్టుబడి దారులకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర అభవృద్ధి చేశాం. చెన్నై నుండి వచ్చిన రజినీ కి హైదరాబాద్ అభవృద్ధి కనపడింది ,కానీ ఇక్కడ గజిని లకు అర్థం కావడం లేదు.. కేటిఆర్ హైదరబాద్ లో ఐటి రంగం బాగుంటే వివిధ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి దొరుకుతుంది..కెటిఆర్ పెదవాల్లకు సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ఏర్పాటు చేశాం సౌభాగ్య లక్ష్మి ,కేసీఅర్ భీమ ,సన్న బియ్యం తో అన్నపూర్ణ పతకాలు కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఉన్న తాగునీటి ,కరేంటు కష్టాలూ ఇప్పుడు లేవు. కెటిఆర్ హైదరబాద్ వాసులు పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె తెలంగాణా పరిస్తితి కుక్కలు చింపిన విస్తరి లా ఉంటుంది..కెటిఆర్ మాధవరం కృష్ణ రావు ఒత్తిడితోనే కాపు ,కమ్మ ,క్షత్రియ సామాజిక వర్గాలకు భూమి కేటాయింపు..కెటిఆర్ కాంగ్రెస్ గతం బి అర్ ఎస్ భవిష్యత్తు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టారు. కొద్దిసేపటి కిందట వాదనలు పూర్తయ్యాయి. స్కిల్ కేసులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఎన్నికల ముంగిట చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారని లూథ్రా వాదించారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారని లూథ్రా ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
ఓట్లొచ్చాయంటే చాలు.. బూట్లరిగేదాకా తిరుగుతుంటారు. గెలిచాక కోట్లు రాల్చుకుంటారు. ఇదే ఇప్పటి నయా రాజకీయం. ఓ పది రోజులు కష్టపడితే పోలా అనుకుంటారు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో నానా పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయినా సరే… గెలుస్తామో లేదో అన్న అనుమానం. అందుకే ఓటర్ల మనసు గెలిచేందుకు వారు పడుతున్న తంటాలు అన్నీఇన్నీ కావు. పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారు. చైతన్య నగర్ కాలనీలో ప్రచారం చేస్తుండగా ఓ హోటల్ కనిపించింది. ఇంకేముంది లోనికి వెళ్లిన కాటా… అక్కడి మాస్టర్ ను పక్కకు జరిపి ఓ దోశ పోశారు. అంతే అదేదో ఘనకార్యం చేసినంత సంతోషపడ్డారు ఆయన అనుచరులు చప్పట్లు చరిచారు. ఉత్సాహపరిచారు. దీంతో కాటా కూడా పొంగిపోయారు. అనుచరులు చప్పట్లు కొట్టక మరేం చేస్తారు? దానికి కాటా మురిసిపోతే అంతే సంగతులు. ఓట్ల వర్షం కురిస్తే కదా ఆయన గెలిచేది. ఏం జరుగుతుందో చూడాలి మరి…
Read Also…
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని యువత భావిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యారు. నిరుద్యోగ యాత్ర పేరుతో యువత రాష్ట్రమంతటా పర్యటించి తెలంగాణా రాక ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణా వచ్చిందే నీళ్లు, నియామకాల కోసమని, కానీ గులాబీ బాస్ ఆ రెండింటిని పూర్తిగా పక్కనపెట్టారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యలో నేటి నుంచి 26వ తేదీ వరకు నిరుద్యోగులు బస్సు యాత్ర చేయాలని తలపెట్టారు. హైదరాబాద్ గన్ పార్క్ నుంచి ప్రారంభమైన యాత్రను ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పది సంవత్సరాల్లో కెసిఆర్ సర్కార్ ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా చేయలేదని మండిపడ్డారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగ నియామకాలు జరిపినా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది మహిళలు, యువత కారణంగా అధికారంలోకి వస్తాయని చెప్పవచ్చు. కానీ కెసిఆర్ సర్కార్ యువత ఆశలను ఆడియాసలు చేయడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. వీరందరూ మూకుమ్మడిగా గ్రామాల్లో పర్యటించి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ ప్రభావం తప్పకుండా కెసిఆర్ పై పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.





Total views : 202770