సూరారం పి.యస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది.. ఉదయం సూరారం మైన్ రోడ్డు లో రిజిష్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న అరుంధతి ట్రేడర్స్ సెల్లార్ గోదాంలో నుండి దట్టమైన పొగలతో అగ్ని ప్రమాదం సంభవించింది. హార్డ్ వేర్, ఎలెక్ట్రికల్ , పివిసి పైపులు నిలువ ఉంచిన సెల్లార్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. షాపు యజమాని సమాచారం తో అగ్నిమాపక సిబ్బంది పైర్ ఇంజన్ తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ఆస్తి నష్టం 5 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం.
Hyderabad
పంజాగుట్ట లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఒకే కళాశాలకు చెందిన రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో విద్యార్థికి గాయాలు హష్మాన్ కుటుంబీకుల కథనం ప్రకారం, బంజారాహిల్స్ సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ బంజారాహిల్స్‌లోని అమ్జెద్ అలీఖాన్ కాలేజీలో బీబీఏ చదువుతున్న సయ్యద్ హష్మాన్ తాహా-21 ఏళ్లుగా అదే కళాశాలలో చదువుతున్న నోమన్ ఖాద్రీ, అద్నాన్, ఒమర్ అబ్దుల్ హమీద్ తదితరులు మారణాయుధాలతో దాడి చేశారు. క్షతగాత్రుడిని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించడంతో అతని అన్న సయ్యద్ ఖాసీం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్ పోలీస్…
Read Also..
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్ వివరించారు. ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదు, బంగారం ప్రభావాన్ని తగ్గించేందుకు సర్వేలేన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని, ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం రూ. 46.81 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. నగరంలో ఇతర జిల్లాల నుంచి అక్రమ రవాణాను నిరోధించేందుకు 18 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, కలెక్టర్, డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
గోషామహల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాజా సింగ్ దూల్పేట్ లోని ఆకాశపురి దేవాలయం వద్ద పూజ అనంతరం తన అభిమానులు మరియు కార్యకర్తలతో కలిసి లోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బైక్ ర్యాలీ గా బయలుదేరారు. ఆయనతోపాటు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఉదయం అబిడ్స్ లోనే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు అనంతరం రెండవసారి అభిమానులతో అబిడ్స్ కు బయలుదేరారు.
Read Also..
జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని, ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు. కాగా, బుద్దా వెంకన్న వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉండగా, సీఐడీ అధికారులు హైదరాబాదుకు వెళ్లి మరీ నేరుగా బుద్దాకు నోటీసులు అందించారు.
మధుయాష్కీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఉద్యమ కారులు , వికలాంగులు,విద్యార్థి యువకులు. హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు విద్యార్థి యువకులు, వికలాంగులు, ఉద్యమ కారులు భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సమక్షంలో 200 మంది యువకులు, ఉద్యమ కారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమం లో ముందు నడిచిన రాష్ట్ర సాధన కు కృషి చేసిన మధు యాష్కీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషం గా ఉందని, మధు యాష్కీ గెలుపుకు తమ వంతు సహకారం అందిస్తామని యువకులు ఉద్యమకారులు తెలిపారు. విద్యార్థి,ఉద్యమ అమరుల త్యాగాలపై ఏర్పడిన తెలంగాణ లో ఉద్యమ కారులకు, విద్యార్థులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని తెలిపారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎల్బీనగర్ ప్రజలు మధు యాష్కీ ని గెలిపించుకోవలని కోరారు.
కౌరవులైన MLA సుదీర్ రెడ్డి, అతని అనుచరులను ఓడించేందుకు పాండవులు ఐనా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా ఐక్యంగా కదులుతున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదు యస్కి గౌడ్ అన్నారు. మా ఐక్యత చూసి సుదీర్ రెడ్డి కి లాగులు తడుస్తున్నాయని అన్నారు. చైతన్యపురి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్ రెడ్డి రాంరెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..సుదీర్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, గుండాలను వెంబడి పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను, కాలనీ అధ్యక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సుదీర్ రెడ్డి కబ్జాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాంరెడ్డి ఎంతో పోరాటం చేశారని అన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఎల్బినగర్ ప్రజలను కోరారు.
Read Also..
వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం, ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో, విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా పురందేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారని అన్నారు.ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? అని పురందేశ్వరిని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో మీ నిజాయతీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలంటూ సవాల్ విసిరారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర మీ కుటుంబ సభ్యులు ముడుపులు తీసుకున్నారని అన్నారు.హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారని, ఆ విల్లాకు సొమ్ము ఎవరు ఇస్తున్నారంటూ పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.





Total views : 199274