Mahabubnagar
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వ సభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ విజయ లక్ష్మీ, వైస్ చైర్మన్ మహిముద బేగంలు హాజరయ్యారు. పలువురు వార్డు కౌన్సిలర్ల మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ, కొల్లాపూర్ మున్సిపాలిటీలో గతంలో మున్సిపాలిటీలో జరుగుతున్న పనుల సమాచారము స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలపకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని అలాంటివి జరగకుండా, సభ్యుల పట్ల సమాచారం ఇస్తూ వారి సూచనల మేరకు వార్డుల్లో పనులు నిర్వహించాలని, మిషన్ భగీరథ పైప్లైన్ కి సంబంధించి అధికారులు గతంలో పూర్తిగా ఆయా వార్డుల్లో నేటికీ మిషన్ భగీరథ పైపులు పూర్తికాలేదని వెంటనే అధికారులు వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు మిషన్ భగీరథ నీటిని అందివాలని సూచించారు. విద్యుత్ సిసి రోడ్లకు సంబంధించిన పనులను అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించాలని ఈ సమావేశంలో చర్చించారు.
నిత్యం క్షణం తీరిక లేకుండా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు అలుముకుంది. మేఘాలు నేలను ముద్దాడినట్టుగా పట్టణంలో ఎటు చూసినా శీతల ప్రదేశంతో కూడిన కాశ్మీర్ అందాలను తలపించింది. దీంతో ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా పొగ మంచు అలుముకోవడంతో పట్టణవాసులను కనువిందు చేసింది. మరోవైపు మార్నింగ్ వాకర్స్ క్రీడా మైదానంలో వాకింగ్ చేయడానికి వెళ్లి పొగ మంచు అందాలను వీక్షించారు. నిత్యం పరిమితిని మించిన వేగంతో వెళ్లే వాహనాలు పొగ మంచును చీల్చుకొని ముందుకు వెళ్తున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం ఈ నెల 26వ తేది అర్ధరాత్రి జరగనున్నది. ఈ జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తల్లి రావడం జరుగుతుంది. కావున స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా దేవరకద్ర బస్టాండ్ నుండి ఆర్టిసి బస్సులను, దర్శనం కోసం క్యూలైన్లు, స్నానపు ఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో ప్రసాద్ తెలిజేశారు. రాజమూరు ఆంజనేయ స్వామిని ఇంటికి ఇలా వేల్పుగా భక్తులు భావిస్తారు. ఈ దేవాలయం కు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు చింతచెట్టు కింద ప్రత్యక్షంగా వెలిశారు. భక్తులు మనసులో కోరికలు అనుకొని ఈ చింత చెట్టుకు ముడుపులు కడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి పైకప్పు లేకపోవడం ప్రత్యేకత.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ లు మరియు జీపు డ్రైవర్లు వాళ్ల యొక్క ఆటోలు మరియు జీపులను స్థానిక బస్టాండ్లో నిలిపిఉంచి నిరసన తెలిపారు. అనంతరం డ్రైవర్లు అంతా కలిసి మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాన పథకం రద్దు చేయాలంటూ ర్యాలీ తీశారు.ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్లమా ఆటో మరియు జీపు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గతంలో ఆటో, జీపుల ద్వారా రోజుకు 500 రూపాయలు సంపాదించే వారిమని, ఇప్పుడు ఈ పథకం వల్ల రోజుకు వంద రూపాయలు కూడా మా ఆటో, జీపులకు గిరాకీలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించిత ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేసి, మా ఆటో డ్రైవర్ లను ఆదుకోవాలని తెలిపారు.
జడ్చర్ల నియోజకవర్గంలో ఇసుక మాఫీయా చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా అనిరుధ్ రెడ్డి జడ్చర్లలో పర్యటించారు. ఎక్కడా కూడా ఇసుక మాఫియాకు తావు లేదని, ఇప్పటికే నవాబుపేట మండలంలో 13 ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఒకవేళ ఎవరైనా ఇసుక మాఫియాకు సొంతపార్టీ వారే సహకరిస్తే వారిని కూడా వదిలిపెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు. జడ్చర్ల నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఆర్ అండ్ బి సహకారంతో త్వరలోనే 100 కోట్ల నిధులతో రోడ్లు వేయిస్తామని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారికి ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ గా తనకు తెలియజేయవచ్చన్నారు. పట్టణంలో నూతన గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారు ఒక కాపీ నాకు ఇస్తే, 15 రోజులలో ఇంటి పర్మిషన్ ఇస్తామన్నారు. ఏ అధికారి అయినా సరే లంచాలు అడిగితే నేరుగా తనకు గాని తన కింది వారికి గాని ఫిర్యాదు చేయవచ్చని అనిరుధ్ ప్రజలకు సూచించారు.
నల్లమలలో పెద్ద పులి కలకలం రేపుతోంది. కృష్ణానదిలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన పెద్ద పులి, భయాందోళనలో వైజాగ్ జాలర్లు మత్స్యకారులు పశువుల కాపరులు. అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరిగిరి సమీపంలోని పాత బొల్లారం దగ్గర పెద్ద పులి సంచారాన్ని గుర్తించారు. మూడు రోజుల క్రితం ఎల్లూరు గ్రామానికి చెందిన మేకల రాముడు మేకను చంపిన పెద్ద పులి. దీంతో వైజాగ్ జాలర్లు, మత్స్యకారులు, పశువుల కాపరులు భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన అంకాలమ్మ కోటకు భక్తులు ప్రతి మంగళవారం దర్శనం కోసం వెళ్తుంటారు, భక్తులు గుంపులు గుంపులుగా దర్శనానికి వెళ్లాలని, లేకపోతే వెళ్లొద్దని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో వన్య మృగాల సంచారం పెరిగింది, అడవిలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వన్యప్రాణులకు ప్రాణహాని కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
11 మందిని హత్య చేసిన నరరూప రాక్షసుడిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన రామాటీ సత్యనారాయణ అనే హంతకుడు గుప్త నిధుల కోసం మంత్రాలు చేస్తానంటూ ఆస్తులు రాయించుకుని, డబ్బులు తీసుకొని వారిని హత్యలు చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు ఈ నిందితుడిని అరెస్టు చేసి డీఐజీ ,ఎల్ఎస్ చౌహన్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నిందితుడి పేరు రామటి సత్యనారాయణ అలియాస్ సత్యం యాదవ్ (47) సంవత్సరాలు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తో పాటు నాటు వైద్యం చేస్తూ అలాగే గుప్త నిధులు కోసం కూడా మంత్రాల చేసి తీస్తానంటూ చలామణి అవుతున్నాడు. గుప్తనిధుల తీయడానికి తన వద్దకు మంత్రాల కోసం వచ్చిన వారిని తను వశపరచుకొని వారి వద్ద నుంచి డబ్బులు, అలాగే ప్లాట్లు, భూములు తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాడు. ఇక తీర గుప్తనిధులు తీసే ప్రదేశంలో మంత్రాలు నిర్వహించి ఆ సమయంలో తీర్థ ప్రసాదాలు అంటూ గన్నేరు పప్పు నూరిన విషయాన్ని తీర్థంలో కలిపి బాధితులకు ఇచ్చేవాడు. ఇలా తీసుకున్న తీర్థాన్ని సేవించిన వారు అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందే వారు. మరికొందరిని బండరాళ్లతో కొట్టి చంపాడు ఈ నరరూప హంతకుడు. ఇలా నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, కల్వకుర్తి అనంతపూర్ కర్ణాటక ప్రాంతాలలో 11 హత్యలు చేసినట్లు పోలీసులు ప్రస్తుత విచారణలో తేలింది.
1,2020 సంవత్సరంలో వనపర్తి జిల్లాలో నలుగురి హత్య కేసులో ఇతడు నిందితుడు.
2,, 2021 సంవత్సరంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరినీ.
3) 2022 నాగర్కర్నూల్ జిల్లాలో సంవత్సరంలో ఒక్కరిని.
4) 2023 సంవత్సరంలో నలుగురిని హత్య చేశాడు ఈ నిందితుడు.
నాగర్ కర్నూలు జిల్లాలో వనపర్తి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇవే కాక మరికొన్ని మిస్సింగ్ కేసులో హత్య కేసులో ఇతని పాత్ర పై పోలీసులు విచారణ చేస్తామన్నారు. కోర్టులో న్యాయమూర్తి ద్వారా అనుమతి తీసుకొని మరికొన్ని కేసులలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఐజి ఎల్ ఎస్ చౌహన్, నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మీడియా ముందు నేడు నిందితున్ని ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలియజేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన నాగర్కర్నూల్ సిఐ, ఎస్ఐ, జిల్లా పోలీస్ బృందాన్ని డిఐజి అభినందించారు. వారికి రివార్డు అందేలా కృషి చేస్తామన్నారు.
సింగరేణి సంస్థ పురోగమనానికి TBGKS గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో సంఘ నాయకులు, ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్ లో కవిత తో సమావేశమయ్యారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమన్నారు. సింగరేణి అంటే సింహ గర్జన అని, అదే స్పూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని, సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్పూర్తి జాతీయ సంఘాలకు కూడా లేదన్నారు. గనుల్లో కార్మికులు చేస్తున్న కష్టం, చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతోందని, కాబట్టి ధైర్యంగా పోరాటం చేయాలని దిశానిర్ధేశం చేశారు. అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని కవిత తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లా పనిచేయాలని సూచించారు. అతిత్వరలో తమ సంఘ మ్యానిఫెస్టోను విడుదల చేస్తుందని కవిత ప్రకటించారు.





Total views : 194370