మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అక్రమ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. భూత్పూర్ నుంచి అక్రమంగా డీసీఎం వాహనంలో మద్యం కాటన్ లను తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు వెంబడించి జడ్చర్ల పట్టణంలో వాహనాన్ని పట్టుకున్నారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mahabubnagar
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీలోని 24వ వార్డులో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పేదల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఎన్నికల తరుణంలో దగా చేసేందుకు మాయమాటలతో బిఅర్ఎస్ నాయకులు మళ్లీ వస్తున్నారని వారిని నమ్మవద్దని చెప్పారు. మోసపు మాటలతో వస్తున్న బిఅర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బుద్ధి చెప్పాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, పేదల కోసం అవిశ్రాంతంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని చెప్పారు. నన్ను గెలిపిస్తే నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. మాయ మాటలు చెప్పి బిఅర్ఎస్ పార్టీని నమోవొద్దని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటు వేసి ఆశీర్వదించాలని అన్నారు.
బిజినేపల్లి మండలం వట్టెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయ పడిన సంఘటన చోటుచేసుకుంది. వట్టెం రామ్ రెడ్డి పల్లి తండా కు చెందిన బొగ్గు రామస్వామి(30) బొగ్గు నరసింహ(65) లు నాగర్ కర్నూల్ కు మోటార్ సైకిల్ పై వస్తుండగా వెనక నుండి నాగర్ కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే స్థానికులు నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నాగర్ కర్నూల్ లో ప్రధమ చికిత్స అందించి బాధితులను మెరుగైన చికిత్సల నిమిత్తం వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు చేశారు… అనంతరం మీడియా తో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడుతూ వార్డ్ నెంబర్ స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగానన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు. బిజెపి టికెట్టు బీసీలకు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఒకవేళ టికెట్ రాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా బరిలో ఉంటాను అన్నారు. భారతీయ జనతా పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీలకు అవకాశం కల్పిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.
వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ తూడి ఉన్న మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో బుధవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి శారదతో కలిసి వారి ఇంటి దైవం సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని దంపతులిద్దరూ పూజలు చేశారు. అక్కడి నుంచి సొంత గ్రామం మంగంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామస్తులతో కలిసి దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. స్వర్గస్తులైన వారి తల్లిదండ్రులు వెంకటమ్మ సాయిరెడ్డిల చిత్రపటాల వద్ద నమస్కరించి వనపర్తికి బయలుదేరారు. వనపర్తి రామాలయంలోను ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకున్నా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
‘ఛల్ దేఖ్ లేంగే’ అంటూ కేటీఆర్ స్టెప్పులు… ఎన్నికల వేళ కార్యకర్తలలో కొత్త జోష్
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని BRS అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచన చేసి ఓట్లేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదు. వలసలు వెళ్లి చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు. గతంలో పాలమూరు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులకు కాంగ్రెస్ కారణం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేవరకద్ర నియోజకవర్గ BRS అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ యజమానులను అప్రమత్తం చేసింది.ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. లేనిపక్షంలో లైసెన్స్‌లు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి, గద్దెగూడెం, అడవి అజిలాపూర్, కోయిల్ సాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామాలకు చెందిన మహిళలు మంగలహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014 వరకు నియోజకవర్గం ఎడరిగా ఉండేదని ఇప్పుడు పచ్చన్ని పొలాలతో కళకళ లాడుతుంది. కోయిల్ సాగర్ నుండి వెంకటయ పల్లి మీదిగా కెనాల్ పనులు కేసుల కారణంగా ఆలస్యం అయిందని త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు, వెంకటాయపల్లి ఒక్క గ్రామానికి 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 20 మందికి గృహలక్ష్మి మరియు దళిత బంద్, బిసి బంద్ లాంటి పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటల కరెంటు వస్తుందని, రైతుబంధు లాంటి పథకాలు ఆపివేస్తారు. కావున ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..ఈ నెల 6 న దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ పార్వతమ్మ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…




Total views : 194054