Nalgonda
అధికారుల అండదండలతో దరార్జనే ద్యేయంగా అనుమతులు లేకుండా టాపాకాయల దుకాణం నడుపుతున్న వ్యాపారికి రెవిన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది వత్తాసు పలుకుతున్నారని తనపై గొడ్డలితో దాడి చేసి షాపును ధ్వంసం చేసిన జాస్తి గోపి పై పోలీసులు చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నాకు దిగిన బాధితుడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో టపాకాయల వ్యాపారం నిర్వహిస్తున్న జగడం అశోక్ పై అదే వ్యాపారం చేస్తున్న జాస్తి గోపి అతని కుటుంబ సభ్యులు స్నేహితులు దాడి చేసి టపాకాయల దుకాణాన్ని ధ్వంసం చేశారని బాధితుడు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి వచ్చిన గోపి అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందల రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అన్ని అనుమతులతోనే టపాకాయల దుకాణం నిర్వహిస్తున్నానని, జాస్తి గోపి నిర్వహిస్తున్న టపాకాయల దుకాణానికి ఎటువంటి అనుమతులు లేవని, ఫైర్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది అతనికి వత్తాసు పలుకుతున్నారని వారి అండదండలతోనే ఇతర వ్యాపారస్తులపై దాడి చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని పోలీసులు సిసి ఫుటేజ్ బయటికి ఇవ్వకుండా బెదిరిస్తున్నారని అన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓ రాజకీయ నాయకుని అండదండలతో అందరిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని, నా షాప్ లో తనపై గొడ్డలితో దాడి చేసి ధ్వంసం చేసిన జాస్తి గోపి అతను కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.
Read Also..
యాదాద్రి.. వ్యవసాయ శాఖలో పని చేసే ఇద్దరు శిల్ప, మనోజ్ రిలేషన్ లో ఉన్నారు. శిల్ప ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిగా పని చేస్తోంది.. మనోజ్ యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఏఈఓ పని చేస్తున్నారు. శిల్ప కు సుధీర్ అనే వ్యక్తితో 2012లో వివాహం జరిగింది.. ఒక బాబు ఉన్నాడు.. రెండు సంవత్సరాల నుంచి భర్త కు దూరంగా మనోజ్ తో రిలేషన్ షిప్ లో ఉంది. రెండు నెల నుంచి మనోజ్ లివ్ పెట్టి వెళ్ళిపోయాడు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంకు వచ్చిన మనోజ్, శిల్ప మధ్య మాటమాట పెరిగి కత్తితో దాడి చేయబోయిన మనోజ్ ని అడ్డుకొని అదే కత్తి తో మనోజ్ పైన దాడి చేసి కత్తితో పొడిచింది.
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారం బొల్లేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొని గడపగడప తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారం బొల్లెపల్లి గ్రామాల నుండి BRS పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 15 నుండి 20 సీట్లు కూడా రావని అక్కస్సుతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకు దింపుడు కాలం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని సంకల్పంతో ప్రజలు ఉన్నారని ఉద్యోగ వ్యాపార సంఘాలు రైతులు ప్రజలు తమకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో తనను నకిరేకల్ గడ్డపై అత్యధిక మెజారిటి తో గెలిపించాలని ప్రజలను కోరారు.
Read Also..
Read Also..
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గనికి భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నామినేషన్ వేయడానికి వచ్చారు మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ. తెలంగాణ వస్తే 92 వెయిల ఉద్యోగాలు ఇస్తానన్న చెప్పిన కేసీఆర్10 సంవత్సరాలు గడిసిన నోటిఫికేషన్ వెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇంటికో పింఛన్ ఇస్తున్నానని చెప్తున్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎందుకు చెప్పట్లేడని ప్రశ్నించారు. ఇంటికి క్వాటర్ బీర్లు పంపుతూ తాగుబోతుల తెలంగాణ చేసిండని,కేసీఆర్ కి ఓటు వేస్తే నిరుద్యోగులు బిక్షం ఎత్తుకుని పరిస్థితి వచ్చిందని, రైతులు కూడా బిక్షం ఎత్తుకొక తప్పదన్నారు.తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసినం కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుండని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ని రాజకీయ నిరుద్యోగి చేయడమే తమ లక్ష్యం పంతమన్నారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తూ కేసీఆర్ కు ఓటు వేయొద్దని వేడుకున్నారు.
నల్గొండ జిల్లా.. మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఒకరు అవినీతిపరుడు ఇంకొకరు అహంకారి అయిన వీరి ఇద్దరిని ఇంటికి పంపేందుకు బీజేపీ కార్యకర్తలు నడుం బిగిస్తున్నారని, నవంబర్ 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు గడ్డమీద కాషాయ జండా ఎగరపోతుందని బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వీరితో పాటు కేంద్రమంత్రి ఠాకూర్, బూర నరసయ్య గౌడ్, గొంగిడి మనోహర్ రెడ్డి ఉన్నారు.
ఒక వ్యక్తిని రెచ్చగొట్టి మందు తాగించి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేయించారు – హరీశ్ రావు
కొంతమంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి… ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని చేయని వ్యక్తి అని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్‌లో వచ్చి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ… ఆ రోజు ఒక గంట ఆలస్యమైతే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మొండి కత్తి, కోడి కత్తి అంటూ హేళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి, రాత్రి బావి వద్ద పడుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ తరపున టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి బి ఎల్ ఆర్ ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తుంగ పహాడ్ గ్రామం వద్ద నుండి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీగా బయలుదేరిన బిఎల్ అర్ మిర్యాలగూడ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశానని. టికెట్ కేటాయింపు విషయం అధిష్టానం చూసుకుంటున్నది చెప్పారు. అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులం అందరం సమన్వయంతో కలిసి పనిచేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవలో ఉన్నానని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మిర్యాలగూడ అభివృద్ధికి అంకితమై పని చేస్తానన్నారు.
నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానంలో నామినషన్ పత్రలతో నకిరేకల్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Read Also..





Total views : 194192