ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో లంగాణలో ఐటీ సోదాలు కూడా ఊపందుకున్నాయి. ఓ వైపు పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ దాడులు నిర్వహించారు. మరోవైపు అధికారపార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని రోహిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రోహిత్ ఇంట్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరుడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Rangareddy
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా 25వ తేదీన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లు విజయభేరి సభకు హాజరు అవుతున్నారని ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రేస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని అమనగల్ పట్టణం లో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సందీప్, కల్వకుర్తి ఎన్నికల పరిశీలకులు మునీర్, టిపీసీసీ అధికార ప్రతినిధి బలాజిసింగ్, టిపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ లతో 25వ తేదీన జరిగే బహిరంగసభ స్థలిని పరిశీలించి మీడియా సమావేశంలో పాల్గొన్న కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మాట్లాడుతూ అమనగల్ లో జరిగే బారి బహిరంగసభ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కల్వకుర్తి నియోజకవర్గం లోని కల్వకుర్తి, వెల్దండ, అమనగల్, మాడ్గుల తలకొండపల్లి, కడ్తాల్ మండలాలలో అన్ని గ్రామాల ప్రజలు తరలివచ్చి సభను విజవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో CMR 27వ షాపింగ్ మాల్ ను ప్రారంభించించారు. సినీ నటి అనసూయ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనసూయ తో పాటు ప్రారంభోత్సవంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు పాల్గోన్నారు. ప్రారంభోత్సవానికి వచ్చిన యువతతో అనసూయ సెల్ఫీలతో సందడి చేశారు. అనసూయ మీడియాతో మాట్లాడుతూ షాద్ నగర్ లో CMR షాపింగ్ మాల్ లో అందరికి అందుబాటు ధరలతో అధునాతన వెరైటీలతో ఆకర్షణీయమైన డిజైన్ లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. బట్టల కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే దగ్గరలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు.
Read Also…
Read Also…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలైన ఓట్లను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 13 నియోజకవర్గాలకు విడివిడిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైనట్లు తెలిపారు.
Read Also..
Read Also..
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు ఇబ్రహింపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేక ఆరు గ్యారంటీలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఏమైందో అందరికి అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ కలలు కంటోందని, బీజేపీ సింగిల్ సీటుకే పరిమితం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా జరుగుతున్నాయని వివరించారు. ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని చెబుతున్నమంచిరెడ్డి కిషన్ రెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి ఫేస్ టు ఫేస్.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు. రైతు రుణమాఫీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కాలేదు అని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు. మాట్లాడుతున్నారు టెన్ హెచ్‌పీ మోటర్ చాలు అని టెన్ హెచ్‌పి మోటర్ వాళ్ళ అయ్యా కొనిపిస్తాడా విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి. లేదంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. పరిగి ప్రజలు మండలం కావాలని అడిగితే మమ్మదాబాద్ చౌడాపూర్ మండలాలు కొత్తగా చేయడం అలాగే మహేష్ రెడ్డి నా స్నేహితుడి కొడుకు. నా కొడుకుతో సమానం. మీరు మహేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను పరిగిలో కూర్చొని మీ సమస్యలు తెలుసుకొని తీరుస్తాను. ఇంకా పరిగి నియోజక వర్గ విద్యార్థులకు గాని ఐటి కాలేజీలు గాని పారామెడికల్ కాలేజీతో పాటు బంజారా భవన్ ఇంకెన్నో అభివృద్ధి పథకాలు తెచ్చి పరిగి నీ డెవలప్ చేసే బాధ్యత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కచ్చితంగా తీసుకుంటారు. మహేష్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Also…
Read Also…
జనరల్ ఎలెక్షన్ -2023 నేపథ్యం లో స్టీఫెన్ రవీంద్ర, IPs. కమీషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాదు గారి ఆదేశాల డీసీపీ శంషాబాద్ నారాయణ రెడ్డి, ADDL డీసీపీ రామ్ కుమార్, ACP SHADNAGAR గారి పర్యవేక్షణ లో ఆమనుగల్ సిఐ. జె. వెంకటేశ్వర్లు, తలకొండపల్లి యస్. ఐ., సి.యచ్. శ్రీను మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సంయుక్తంగా రైడ్ చేయగా జూలపల్లి లోని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన జైపాల్ రెడ్డి పౌల్ట్రీ ఫారం లో ఒక్క రూం నందు ఇంపీరియల్ బ్లూ కటాన్స్ (204), ఒక్కో కటాన్స్ నందు (48) బాటిల్స్ ఉన్నాయి. ఒక్క బాటిల్ 180 ఎంఎల్ మొత్తం 9792 బాటిల్స్ (1762.56 లిటర్స్) ఇట్టి మద్యం విలువ 19,38,816/-. ఇట్టి మద్యం ఎలెక్షన్ లో ఓటర్స్ ను ప్రలోభలకు గురిచేయడానికి జైపాల్ రెడ్డి తెప్పించి తన పౌల్ట్రీ ఫారం నందు డంప్ చేయించాడు అని తెలిసింది. ఇట్టి మద్యంను పంచుల సమక్షంలో సీజు చేసి, నేరస్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబందు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తమ మిత్రపక్ష జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రేమ్ కుమార్‌ని గెలిపించాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి కూడా మద్దతు ఉంటుందని వెల్లడించారు.లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేసి, మూడు కోట్ల ఇళ్లు నిర్మించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ, విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం మామిడిపల్లి, శ్రీనివాసుల గూడ, మొదళ్ళ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి భారీ స్పందన లభించింది. స్ధానిక నేత మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలనీ, ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని అంజయ్య చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్ఎస్ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్ పరిపాలన’ అని అంజయ్య ఎద్దేవా చేశారు
పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత భద్రంగా ఉంటదో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులో ఉంటే అంతే భద్రంగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గం లోని సరస్వతి గూడ, అగర్మియా గూడ, లేమూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి మాట్లాడుతూ చుట్టం చూపులాగా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. నియోజకవర్గ ప్రకారంగా ఎలాంటి అవగాహన లేని వాళ్ళు నియోజకవర్గంలో తిరుగుతున్నారు .ఒకరేమో డబ్బుల సంచులు మోసుకొని తిరుగుతున్నారు, ఒకరేమో కులమతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చెప్పి తిరుగుతున్నారు.గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎలాంటి కులమతాల మధ్య చిచ్చు లేకుండా, తెలంగాణను సస్యశ్యామలంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు,ఎంపీటీసీలు, సర్పంచులు,వార్డు సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు,మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు పాల్గొన్నారు.






Total views : 198621