Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Telangana కేంద్రం, బీఆర్‌ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం..

కేంద్రం, బీఆర్‌ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం..

by CVR NEWS
కేంద్రం, బీఆర్‌ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

ధాన్య సేకరణపై కేంద్రంలోని బీజేపీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం యాసంగిలో రికార్డు స్థాయిలో ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. పదేళ్ల తమ పాలనలో ఎంత కొన్నారో చూసుకుని విమర్శలు చేయాలని బీఆర్‌ఎస్ నేతలకు హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు సేకరిస్తున్నామని.. నిన్నటి వరకు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని వెల్లడించారు. అంతేకాదు, గత ప్రభుత్వం కంటే తాము రూ. 5,000 కోట్లు ఎక్కువగా.. ఈ మే నెల వరకే రూ. 9,000 కోట్లు రైతులకు చెల్లించామని, ధాన్యం కొన్న 48 గంటల్లోనే ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: