Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Film మనసును కదిలించే నజీబ్ జీవిత కథతో తెరకెక్కిన “ది గోట్ లైఫ్”

మనసును కదిలించే నజీబ్ జీవిత కథతో తెరకెక్కిన “ది గోట్ లైఫ్”

by Rama
The Goat Life

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్ (The goat Life)” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాకు మూలమైన నజీబ్ గురించి ప్రచార కార్యక్రమాల్లో మూవీ టీమ్ చెబుతున్న విషయాలు ప్రేక్షకుల మనసులను కదలిస్తున్నాయి.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లాడు నజీబ్ అనే అమాయక యువకుడు. ఎంతోమంది యువకుల్లాగే అతనూ గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోతాడు. రెండేళ్లు ఏడారిలో ప్రయాణిస్తూ అనేక కష్టాలు పడతాడు. 700 గొర్రెలను కాపాడుకుంటూ అతని ఎడారి ప్రయాణం ఎంతో శ్రమతో సాగుతుంది. నజీబ్ కు ఉన్న ఒకే జత బట్టలతో స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు కూడా వీలుండదు. తినేందుకు సరైన ఆహారం దొరక్క విపరీతమైన ఎడారి వాతావరణంలో నజీబ్ ఊహాతీతమైన కష్టాలు ఎదుర్కొంటాడు. ఒక దశలో నజీబ్ కు మనిషి మీద మానవత్వం మీద నమ్మకం పోతుంది. తాను కాపాడుకుంటున్న గొర్రెల్లో తానూ ఒక గొర్రెగానే భావించుకుంటాడు. 8 నెలల ప్రెగ్నెంట్ భార్యను వదిలి విదేశీ ఉద్యోగానికి బయలు దేరిన నజీబ్ కు ఇప్పుడు తనకు పుట్టిన బిడ్డ ఎలా ఉందో తెలియదు. వారి జ్ఞాపకాలతో ఊరట చెందుతుంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తాడు. కొన్నేళ్ల తర్వాత చివరకు తన కుటుంబానికి చేరువవుతాడు. నజీబ్ సాగించిన ఈ సాహసోపేత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తికరంగా నిలుస్తోంది. నజీబ్ జీవితంలోని ఈ భావోద్వేగాలన్నీ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాలో అత్యంత సహజంగా చిత్రీకరించారు.

నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ – సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
మ్యూజిక్ – ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
నిర్మాణం – విజువల్ రొమాన్స్
దర్శకత్వం – బ్లెస్సీ

ఇది చదవండి: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్


హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు …
ఎన్టీఆర్‌కు విజయవంతంగా సర్జరీ.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఎన్టీఆర్‌కు …
కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ అవేటెడ్ థ్రిల్లర్ “హైవాన్” సినిమా టీజర్ రిలీజ్.
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా "హైవాన్". …

Follow us on: Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: