Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Film ‘కలియుగం పట్టణంలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమన్…

‘కలియుగం పట్టణంలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమన్…

by Prakash
Kaliyugam Pattanamlo


‘కలియుగం పట్టణంలో’(Kaliyugam Pattanamlo) పెద్ద విజయాన్ని సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమన్

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో సుమన్, నిర్మాత ఏ.ఎం.రత్నం వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో..

రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది..

నిర్మాత డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను విద్యా వేత్తగా ఇంజనీరింగ్ కాలేజీలను నిర్వహిస్తున్నాను. పిల్లల్లో ఉన్న ప్యాషన్‌కు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించాను. నేను ఉన్న, పెరిగిన ఊరుని తెరపై చూపించాలనే కోరిక ఉండేది. రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అయితే బడ్జెట్ మాత్రం ఎక్కువ అవుతుందని డైరెక్టర్ చెప్పారు. అయినా పర్లేదని ముందుకు వచ్చాం. సినిమాలు వద్దు అన్నవాళ్లు కూడా మా టీజర్, ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ మూవీ తరువాత రమాకాంత్‌కు, అలాంటి కొత్త వాళ్లకి చాలా మంది నిర్మాతలు అవకాశం ఇస్తారు. విశ్వ కార్తికేయ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయుషి పటేల్‌కు ఇది మొదటి సినిమా. చూడగానే ఈ పాత్రకు సెట్ అవుతుందని చెప్పాను. కలియుగం పట్టణంలో సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. మార్చి 29న మా చిత్రాన్ని థియేటర్లో అందరూ చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ రమాకాంత్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్..

మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా చిత్రం ఇంత త్వరగా పూర్తయి, రిలీజ్‌కు రెడీ అవ్వడానికి ఓబుల్ రెడ్డి కారణం. డైరెక్టర్ రమాకాంత్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ మూవీకి అన్నీ చక్కగా కుదిరాయి. అజయ్ మ్యూజిక్, ఆర్ ఆర్ చాలా బాగుంటుంది. చంద్రబోస్ గారి సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. అన్ని పాత్రలు చక్కగా వచ్చాయి. మా సినిమా మార్చి 29న రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

అందరూ థియేటర్లోనే వీక్షించండి..

కాటం రమేష్‌ మాట్లాడుతూ.. ‘రమాకాంత్ గారు కథ చెప్పినప్పుడు నేను సినిమాను నిర్మిస్తానని అనుకోలేదు. నాని గారి సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ చక్కగా నటించారు. అజయ్ మంచి ఆర్ ఆర్ ఇచ్చారు. మా సినిమా మార్చి 29న రాబోతోంది. అందరూ థియేటర్లోనే వీక్షించండి’ అని అన్నారు.

చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్..

నిర్మాత ఏ ఎం రత్నం మాట్లాడుతూ.. ‘అందరూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కలియుగం పట్టణంలో (Kaliyugam Pattanamlo) టైటిల్ చాలా కొత్తగా ఉంది. చంద్రబోస్ రాసిన కలియుగం కలుషితం అనే పాట బాగుంది. ఆ పాటనే టైటిల్‌గా పెడితే ఇంకా బాగుండేదని అనుకున్నా. కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియెన్స్ ఎలాగూ చూస్తారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo) పెద్ద విజయాన్ని సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమన్

సుమన్ మాట్లాడుతూ.. ‘విశ్వ కార్తికేయ తండ్రి రామానుజంతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. విశ్వని చిన్నతనం నుంచీ చూస్తున్నాను. విశ్వను ఎంతో చక్కగా పెంచారు. అతను చాలా మంచి వాడు. పెద్దలంటే చాలా గౌరవం. విశ్వ కార్తికేయకు ఈ సినిమాతో చాలా మంచి పేరు రావాలి. నటనలో అతను ఎంతో శిక్షణ తీసుకున్నాడు. నిర్మాత ఓబుల్ రెడ్డి ఈ సినిమాను తన ఊర్లో తీయడం చాలా గొప్ప విషయం. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ రమాకాంత్ చేశారు. అలా చేయడం మామూలు విషయం కాదు. మాటలు, పాటలు అన్నీ బాగున్నాయి. చంద్రబోస్ వంటి వారు ఈ సినిమాకు పాటలు రాయడం గొప్ప విషయం. టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29న ఈ చిత్రం రాబోతోంది. అందరూ సినిమాను చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

సినిమాలో నటించిన వారందరికీ థాంక్స్..

డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో (Kaliyugam Pattanamlo) అజయ్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. దేవీ ప్రసాద్ వంటి సీనియర్లను డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. నరేన్ రామ చక్కగా నటించాడు. నిర్మాత మహేష్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మరో నిర్మాత రమేష్ గారు చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటారు. ఓబుల్ రెడ్డి గారు నాకు సోదర సమానులు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయుషి పటేల్ ఎంతో బాగా నటించారు. విశ్వ కార్తికేయ అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమాలో నటించిన వారందరికీ థాంక్స్. మార్చి 29న మా చిత్రం రాబోతోంది. అందరూ థియటర్లో వీక్షించండి’ అని అన్నారు.

కలియుగం పట్టణంలో యూనిక్ థ్రిల్లర్ మూవీ

విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సుమన్ గారికి, ఏ ఎం రత్నం గారికి, రాజా గారికి థాంక్స్. కలియుగం పట్టణంలో (Kaliyugam Pattanamlo) యూనిక్ థ్రిల్లర్ మూవీ. మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్‌ను కలిపి చేసిన ఓ డిఫరెంట్ సినిమా. ప్రతీ ఒక్క పాత్ర, ఎమోషన్‌కు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మార్చి 29న మా సినిమా రాబోతోంది. మా నిర్మాతల సహకారం వల్లే సినిమా బాగా వచ్చింది. రమాకాంత్ గారు ఈ స్టోరీని నాకు మూడు గంటలు వినిపించారు. అద్భుతంగా కథను నెరేట్ చేశారు. నన్ను నమ్మి ఇంత భారీ బడ్జెట్‌తో సినిమాను తీసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అజయ్ మ్యూజిక్, చరణ్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. మా సినిమాకు చంద్రబోస్ గారు పాటలు రాయడం పెద్ద అస్సెట్. ఆయుషి పటేల్ చక్కగా నటించారు. మేం ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. మార్చి 29న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

ఆయుషి పటేల్ మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో నాది చాలా ప్రత్యేకమైన పాత్ర. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్ర లభించడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. విశ్వ చాలా సపోర్ట్ చేశారు. మార్చి 29న మా చిత్రం రాబోతోంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాద మాట్లాడుతూ.. ‘చంద్రబోస్ గారు మాకు మంచి సాహిత్యం అందించారు. ఆయన ఇచ్చిన లిరిక్స్ చూసి మేం షాక్ అవుతుండేవాళ్లం. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఆర్ఆర్‌ కోసం స్పెషల్‌గా పని చేశాం. నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్స్. మార్చి 29న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

రైటర్, డైరెక్టర్ రాజా మాట్లాడుతూ.. ‘నరేన్ రామ ఫోన్ చేసి కలియుగం పట్టణంలో సినిమా ఈవెంట్‌కు రావాలని అన్నారు. నేను ఈ మధ్య బయటకు రావడం లేదు. ఈ మూవీ కోసం ఇలా రావడం ఆనందంగా ఉంది. దర్శక నిర్మాతలకు పెద్ద హిట్ అయి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Follow us on : Google News  మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆదిత్య మ్యూజిక్ మాధవ్ మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో పాటలు బాగున్నాయి. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఉంది. నిర్మాతలు కొత్త వారైనా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. మార్చి 29న ఈ చిత్రం రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో సినిమా ప్రారంభం నుంచి వింటూనే ఉన్నాను. మా నాని ఈ చిత్రాన్ని చక్కగా నిర్మించాడు. హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ ఆయుషి పటేల్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..
దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ …
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019269
Total views : 90185

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.