Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home National వాణిజ్య నౌకను కాపాడిన భారత నేవీ

వాణిజ్య నౌకను కాపాడిన భారత నేవీ

by Satya
The Indian Navy saved the merchant ship

అరేబియా సముద్రంలో సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్‌కు గురైన వాణిజ్య నౌకను భారతీయ నావికా దళం కాపాడింది. నౌకలోని హైజాకర్లను తరిమేసి 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది సిబ్బందిని కాపాడింది. సుమారు ఆరుగురు ఆగంతకులు ఆయుధాలతో నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేశారు. వెంటనే నౌకలోని సిబ్బంది తమను కాపాడాలంటూ ఎమర్జెన్సీ సందేశాన్ని పంపించారు. సమాచారం అందుకున్న వెంటనే ఐఎన్ఎస్ చెన్నై రంగంలోకి దిగింది. నౌకను చుట్టుముట్టి హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో నేవీ కమెండోల బృందం మార్కోస్ నౌకలోకి ప్రవేశించింది. దీంతో, బెదిరిపోయిన హైజాకర్లు నౌకను వదిలి పారిపోయారు. నౌకలో హైజాకర్లు ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక నేవీ కమాండోలు నౌకలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం, రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు నేవీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: