Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Latest News రక్తం కక్కుకుని మృతి చెందిన విద్యార్ధిని..

రక్తం కక్కుకుని మృతి చెందిన విద్యార్ధిని..

by Rama
A girl died

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి కస్తూరిబా గురుకుల పాఠశాల ఆరవ తరగతి విద్యార్థిని రక్తం కక్కుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో వెలుగు చూసింది. పలమనేరు మండలం, కొలమాసిన పల్లి గ్రామం, పల్నాడు కు చెందిన దంపతులు చందు సుజాత ల కుమార్తె స్వాతి(13) మదనపల్లి నియోజకవర్గంలోని, నిమ్మనపల్లి ముస్టురు కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో స్వాతి ఆరవ తరగతి చదువుతోంది. తీవ్ర ఆస్పస్థతకు గురైన బాలికను గుర్తించి స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చేశారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తన బిడ్డను స్వగ్రామానికి తరలిస్తూ మార్గమధ్యంలోని పుంగనూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయడంతో రాత్రి 11.30 వచ్చి ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేర్పించారు. బ్లడ్ వామిట్స్ ఇకమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వాతి చనిపోయింది.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014168
Total views : 79379

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.