జగిత్యాల మున్సిపాలిటీ(Jagityala Municipality)లో భూకుంభకోణం కేసు(Land Scam Case)లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో నిందితులుగా అమిరుద్దీన్, ముజాకీర్ లతో పాటు మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. జగిత్యాల పట్టణం హస్నాబాద్ లో 12 గుంటలకు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో ఈ భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో దీర్ఘకాలిక సెలవులలో మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై 409, 420, 467, 471, 468, 120(b), r/w34 ఐపీసీ క్రింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.