Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana ‘ పద్మశ్రీ ‘ పురస్కారాల విజేతలకు.. రేపు తెలంగాణ ప్రభుత్వ సన్మానం

‘ పద్మశ్రీ ‘ పురస్కారాల విజేతలకు.. రేపు తెలంగాణ ప్రభుత్వ సన్మానం

by Satya
Padma Shri awardees

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన విజేతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. రేపు శిల్పకళా వేదికలో సన్మాన కార్యక్రమానికి నిర్వహించనున్నారు. పద్మవిభూషన్‌కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవిని మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆహ్వానించారు. వెంకయ్య నాయుడు, చిరంజీవితో పాటూ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్‌లాల్, శిల్పకారుడు సత్తి ఆనందాచారిని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. పద్మశ్రీ విజేతలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించాలని మంత్రి జూపల్లి సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisements

You may also like

Our Visitor

039289
Total views : 196224

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: