Tuesday, September 15, 2026
News Navigation
Tuesday, September 15, 2026
News Navigation

Breaking

Tuesday, September 15, 2026
Home Latest News కడియం, దానంపై స్పీకర్ సంచలన తీర్పు

కడియం, దానంపై స్పీకర్ సంచలన తీర్పు

దానం, కడియంలకు స్పీకర్ క్లీన్‌చిట్‌

by CVR NEWS

తెలంగాణలో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. దానం, కడియంపై దాఖలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం, కడియంలపై తాజాగా వాదనలు పూర్తికాగా.. నిర్ణయాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12లోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండగా.. ఒకరోజు ముందే.. స్పీకర్ కడియం, దానం నాగేందర్‌ పై దాఖలైన రెండు పిటిషన్లను డిస్మిస్ శారు.

మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కోగా, వారిని విచారించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, ఇప్పటికే ఎనిమిది మందికి క్లీన్‌చిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాలి. గత లోక్ సభ ఎన్నికల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆమె ఎన్నికల ప్రచారంలో కడియం అంతా తానై వ్యవహరించారు. అంతేకాదు కూతురు గెలుపు కోసం తన వంతుగా కృషి చేశారు. మరోవైపు దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పోటీ చేశారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచినా.. ఒకరు కూతురు కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. దానం ఏకంగా ఎమ్మెల్యేగా ఉంటూ సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: