తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామని పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించింది. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్న సుప్రీంకోర్టు.. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించారు. మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
154
previous post




Total views : 47729