నగర ప్రజలంతా తన కుటుంబ సభ్యులనీ… కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆదరణ, ఆశీసులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జెఎన్ రోడ్డులోని చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీయే కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. జగన్ పాలనలో ఐదేళ్ల పాటు మనమంతా చాలా ఇబ్బందులు పడ్డామని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. అధికార దురంహంకారంతో తనకు అసలు టిక్కెట్టే రాదని, రాజకీయాల్లో లేకుండా చేస్తామన్న ఒక వ్యక్తి ఇప్పుడు అసలు కనిపించకుండానే పోయాడన్నారు. నగరంలో ఐదేళ్ల పాటు పారిశుద్ధ్యాన్ని పక్కన పెట్టేశారని, అధికార దుర్వినియోగం చేస్తూ అనాలోచితంగా చేసిన పనులు కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వాటన్నింటినీ సరి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి పని చేయాలి అని అధికారులకు సూచించామన్నారు. మాట వినని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ అధికారైనా మాట వినకపోతే తన దృష్టికి తీసుకువస్తే ఆ పని చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆరోగ్యకర రాజమండ్రి కోసం కృషి చేస్తున్నామన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో లక్కీ స్కీం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కారుణ్య లక్కీ స్కీం పేరుతో సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తంగుడు శ్రీధర్, దాదాపు రూ.80 లక్షలతో పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుల…
- చిత్తూరు ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం.చిత్తూరు నగరంలోని ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు . పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సమన్వయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు .…
- సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ బ్లాక్‍ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని…
- కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే-సీఎం చంద్రబాబు.రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో…
- పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 194302