మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంతో అప్రమత్తమైన అధిష్టానం బుజ్జగింపు చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు ఇవాళ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు వారు గంటకు పైగా చర్చలు జరిపారు.
దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్న జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడకూడదని మంత్రులు జీవన్ రెడ్డికి సూచించారు. సీనియర్ నేతగా మీ సేవలు పార్టీకి ఎంతో అవసరమని వారు స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న రాజకీయ ఇబ్బందులు, ఇతర అసంతృప్తులపై మంత్రులు ఆయనతో చర్చించారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని గట్టి హామీ ఇచ్చారు. అయితే, ఈ సమావేశం ముగిసిన ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి తాను పార్టీ మారే నిర్ణయాన్ని మార్చుకుంటారా.. లేదా అనేది సస్పెన్స్‌లా మారింది.
జీవన్ రెడ్డితో చర్చలు జరిపిన శ్రీధర్ బాబు, లక్ష్మణ్
138
previous post





Total views : 62205