Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh పలు రైళ్లు రద్దు..

పలు రైళ్లు రద్దు..

by Rama
Train Cancellation

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. హవ్‌డా-సికింద్రాబాద్ , ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హవ్‌డా-బెంగళూరు దూరంతో ఎక్స్‌ప్రెస్, షాలీమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ ప్యాసింజర్, తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇక భువనేశ్వర్-కేఎస్‌ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌నూ రీషెడ్యూల్ చేశారు. నేటి ఉదయం 5:40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 10 గంటలకు వెళుతుందని చెప్పారు. రైలు ప్రమాదం నేపథ్యంలో నిన్న కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

026061
Total views : 149834

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.