Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Devotional భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు మాక్ డ్రిల్ కార్యక్రమం

భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు మాక్ డ్రిల్ కార్యక్రమం

by CVR NEWS

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో టి. బాపిరెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా తరలించడం, వైద్య, అగ్నిమాపక సహాయ చర్యలపై ఆక్టోపస్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి చర్చించారు.ఈ మాక్ డ్రిల్ కేవలం భద్రతా ప్రమాణాలను పరీక్షించేందుకేనని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆలయ సీఎస్ఓ, ఏఈఓ, మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భక్తుల రక్షణే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

 

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: