Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Devotional శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.

శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.

by CVR NEWS

నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు,అల్పాహారాన్ని అందిస్తుండాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు, క్యూలైన్ల నిర్వహణలో పోలీసు శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలని ముఖ్య భద్రత అధికారికి ఆదేశించారు. కాలిబాట మార్గంలో వచ్చే పాదయాత్ర భక్తులకు అన్నదానం చేసే దాతలకు శ్రీశైల క్షేత్రం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. భక్తుల రద్దీ కనుకూలంగా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛంద సేవకుల సేవలు వినియోగించుకుంటూ అందరి సమన్వయంతో ఉగాది ఉత్సవాలు విజయవంతం చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223705

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: