Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana ఓటమి బాధ తో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఓటమి బాధ తో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

by Prakash
BRS party member sucide attempt

హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఓటమి పాలు కావడం పట్ల మనస్థాపానికి గురైన బిఆర్ఎస్ కార్యకర్త కుతాటి విజయభాస్కర్ విషతుల్య రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు విజయ్ భాస్కర్ ను హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో విజయభాస్కర్ తో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఫోన్ లో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వాటి గురించి ఇలా చేయడం సరికాదని విజయభాస్కర్ కు నచ్చ చెప్పారు. ఓడిపోవడం జీర్ణించుకోలేక పోతున్నానని, అందుకే ఆత్మహత్యయత్నం చేశానని విజయభాస్కర్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039169
Total views : 194542

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: