Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి….

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి….

by Prakash
TSRTC

టీఎస్ఆర్టీసీ యాజమాన్యం మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది. ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నారని.. TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దీంతో తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామన్నారు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. అందువలన ప్రయాణ సమయం పెరుగుతోందని ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందన్నారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులను కోరింది.

Advertisements

You may also like

Our Visitor

025683
Total views : 147680

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.