Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Telangana కేటీఆర్: కాంగ్రెస్ 412 హామీల సంగతేంటి..?

కేటీఆర్: కాంగ్రెస్ 412 హామీల సంగతేంటి..?

by Prakash
ktr

తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరిట బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని కెటిఆర్ అన్నారు. ఎక్కువ వేతనాలు ఇచ్చి, ఉద్యోగాలిచ్చి చెప్పుకోలేక పోయామన్నారు. ఓటమి మాకు కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని కెటిఆర్ స్పష్టం చేశారు. వంద రోజుల్లో. హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తాము షాడో టీమ్ ను ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే నాలుక మడత వేసిందన్నారు. ఆరు గ్యారెంటీలే కాదు, కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చిందని కెటిఆర్ గుర్తుచేశారు. సుపరిపాలన అందిస్తారా, కక్ష సాధిస్తారా అన్నది వారి ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామన్న కెటిఆర్, ప్రభుత్వం వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని కెటిఆర్ హెచ్చరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: