Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh శ్రీకాళ‌హ‌స్తి లో చారిత్రక కట్టడాలు కూల్చేస్తున్నారు..!

శ్రీకాళ‌హ‌స్తి లో చారిత్రక కట్టడాలు కూల్చేస్తున్నారు..!

by Rama
Historical TTD

చేసిన పాపాలు పోవాల‌ని, స‌న్మార్గంలో న‌డిచేలా దీవించాల‌ని భ‌క్తులంతా శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌ర స్వామిని వేడుకుంటారు. అధికారమ‌దం త‌ల‌కెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి మాత్రం శ్రీకాళ‌హ‌స్తి స‌న్నిధిలోనే పాపాల‌కు పాల్ప‌డుతున్నాడు. స్వామి, అమ్మ‌వార్ల‌కే అప‌చారం త‌ల‌పెడుతున్నాడు. పురాత‌న శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో స్వామి అమ్మ‌వార్ల‌కి నైవేద్యాలు త‌యారుచేసే గ‌ది, మృత్యుంజ‌య పూజ‌లు నిర్వ‌హించే ప్ర‌దేశంలో వేల ఏళ్ల నాటి చారిత్ర‌క కట్ట‌డాల‌ను కూల్చేయిస్తున్నాడు. పురావ‌స్తు, దేవాదాయ శాఖ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో త‌వ్వ‌కాలు చేప‌ట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చారిత్ర‌క‌, పురావ‌స్తు, ఆధ్యాత్మిక సంప‌ద ధ్వంసం చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మే కాదు, పాపం. శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో త‌వ్వ‌కాల‌కు కార‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నానని టిడిపి పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

Advertisements

You may also like

Our Visitor

019510
Total views : 90878

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.