Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana నిందితుడు సైఫ్‌ పై సస్పెన్షన్ పొడిగింపు..!

నిందితుడు సైఫ్‌ పై సస్పెన్షన్ పొడిగింపు..!

by Satya
Preeti suicide case

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్‌పై విధించిన సస్పెన్షన్ కాలం మార్చి 3తో ముగియనున్న నేపథ్యంలో నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి 26న ప్రీతి మృతి తర్వాత సైఫ్ అరెస్టయ్యాడు. ఈ క్రమంలో అతడిపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించడంతో సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేశారు. గతేడాది నవంబరు 9న హైకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ర్యాగింగ్ కమిటీ ఎదుట సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని న్యాయస్థానం పేర్కొనడంతో, సైఫ్‌పై నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Advertisements

You may also like

Our Visitor

014461
Total views : 80275

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.