Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Latest News సర్పంచ్‌ల ఆత్మీయ సత్కారం…

సర్పంచ్‌ల ఆత్మీయ సత్కారం…

by Prakash
ktr at siricilla

పదవులు వస్తాయి పోతాయి… పదవులు శాశ్వతం కాదు… పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని సర్పంచ్‌లు విజయవంతంగా అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో సర్పంచ్‌ల ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ సర్పంచ్‌ల కృషి వల్లే తెలంగాణలోని ఎన్నో గ్రామాలకు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయన్నారు. సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను ఇప్పించేందుకు ప్రతిపక్షంలో ఉన్నందున పోరాడుతామని చెప్పారు. రాజకీయాల్లో ఎదురుదెబ్బలు సహజమన్నారు. గోడకు కొట్టిన రబ్బర్ బంతి తరహాలో మళ్లీ తప్పకుండా తిరిగి వస్తామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039801
Total views : 200858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: