Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Main News ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

by Rama
suicide

సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి జరిగింది. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి, పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది. ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. Read Also..

Advertisements

You may also like

Our Visitor

014266
Total views : 79685

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.