ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకు తత్వం, కవ్వింపు చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, దక్షిణ కొరియా సరిహద్దులకు సమీపంలోని ఓ దీవిపై ఉత్తర కొరియా బాంబుల వర్షం కురిపించింది. ఇప్పటికే అణు ఆయుధాలు, ఖండాంతర క్షిపణులను ప్రయోగించి అంతర్జాతీయ సమాజం ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా కొత్తగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. ఈ రాకెట్ లాంచర్ నుంచి 240 ఎంఎం ఆర్టిలరీ షెల్స్ ను దక్షిణ కొరియాకు దగ్గర్లోని ఓ దీవిపై ప్రయోగించింది. ఈ రాకెట్ లాంచర్ పరీక్షలను ఉత్తర కొరియా ప్రభుత్వం నిర్ధారించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంట్రోల్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నూతన ఆయుధ వ్యవస్థ అభివృద్ధిలో తాజా పరీక్ష కీలకమైనదని తెలిపింది.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.