Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra PradeshWest Godavari పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా..

పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా..

by Rama
Pavan kalyan

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan):

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే జరగాల్సిన భీమవరం పర్యటన వాయిదా పడగా.. ఇప్పుడు మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనే వాయిదా పడింది.
పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా వెనుక ప్రభుత్వ హస్తం ఉందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు పవన్ కళ్యాణ్ సూచించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేసే తేదీలను త్వరలో వెల్లడిస్తామని జనసేన పార్టీ ప్రకటించిది.

Follow us on : Facebook, Instagram & YouTube.


పర్యటన వాయిదా పడటంతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేశారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపడతారని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం భీమవరం వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో వెళ్లేందుకు జనసేన నేతలు సైతం ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని విధంగా.. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేనాని భీమవరం పర్యటన వాయిదా పడింది. భీమవరం విష్ణు కాలేజీలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కు విద్యుత్, రోడ్డు భవనాల శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు.
దీనిపై జనసేన నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్కై కలెక్టర్, పోలీసులకు దరఖాస్తు చేసినట్లు జనసేన నేతలు చెప్తున్నారు. కలెక్టర్, పోలీసు శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందనీ.. అయితే విద్యుత్, ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు. కారణాల ఏవైనా పవన్ పర్యటన మాత్రం వాయిదా పడింది. Read Also..

  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.
    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.
    వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, కేసును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో…
  • అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.
    అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్లు ఓపి కింద వస్తున్నారు .కొంతమంది ఆస్పత్రిలో చేరుతున్నారు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

020343
Total views : 92741

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.