Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Andhra Pradesh ‘రాజధాని ఫైల్స్’ విడుదలపై ఏపీ హైకోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ

‘రాజధాని ఫైల్స్’ విడుదలపై ఏపీ హైకోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ

by Satya
Capital files

‘రాజధాని ఫైల్స్’ చిత్రం విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశాలను ఇచ్చింది. గురువారం సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా సన్నివేశాలు ఉన్నాయంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ఉద్దేశంతోనే సినిమాను తీశారని పిటిషన్ లో ఆయన ఆరోపించారు. నిర్మాతల తరపు న్యాయవాది కోర్టుకు తన వాదనలు వినిపించారు. సెన్సార్ రివిజన్ కమిటీ సూచించిన మార్పులను చేశామని, వారు సూచించినట్లు సన్నివేశాలను తొలగించామని చెప్పారు. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. డిసెంబర్ లో తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే… వైసీపీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని భాను శంకర్ దర్శకత్వంలో రవిశంకర్ కంఠమనేని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

Read Also..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.
    మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
  • నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.
    నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్‌లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
  • రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణను వేగవంతం చేయాలి: పవన్ కళ్యాణ్.
    ఏపీ వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించి, సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలోని…

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: