Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh మైలవరంలో దొంగలు బీభత్సం..!

మైలవరంలో దొంగలు బీభత్సం..!

by Satya
Thieves rampage in Mylavaram

మైలవరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మైలవరంలోని విజయ మిల్క్ డైరీ, రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి షాపులు మూసివేసిన తర్వాత వైన్ షాపుల్లో దొంగతనం చేశారు. మైలవరం బైపాస్ రోడ్‌లోని వాక్ ఇన్‌స్టోర్ , పశువుల హాస్పటల్ సమీపంలోని మద్యం దుకాణం, పక్కనే ఉన్న మిల్క్ డైరీలో దొంగలు చోరీకి తెగబడ్డారు. షాపు పైకప్పు రేకులు కత్తిరించి, తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించేందుకు దుండగులు యత్నించారు. అడ్డువచ్చిన వాచ్‌మెన్లను.. మద్యం సీసా పగలగొట్టి దాడి చేస్తామంటూ బెదిరించారు. ఆపై లోనికి వెళ్లిన దుండగులు చోరీ చేశారు. వాకిన్ స్టోర్‌లో సుమారు 2 లక్షల 11వేల రూపాయలు, మిల్క్ డైరీలో రూ.30 వేలు చోరీకి గురైనట్లు సిబ్బంది గుర్తించారు. షాపుల యాజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకేరోజు మూడు దొంగతనాలు జరగడంతో మైలవరం ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసుల గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..
    ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక…
  • నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
    నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న…
  • మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..
    మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్‌కు చెందిన శివాజీ రాథోడ్‌ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్‌సర్‌లోని కామధేను…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

013924
Total views : 78449

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.