విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు ఎన్‌ఎఎఫ్‌సి యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో దట్టమైన పొగ కమ్మేసింది. స్టీల్ ప్లాంట్ లోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. కోకోవెన్ యూనిట్‌లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగసి పడి అగ్నిప్రమాదానికి కారణంగా మారిందని తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో విద్యుత్ పరికరాలు, యంత్రాలు, అక్కడ ఉన్న మెటీరియల్ అంతా పూర్తిగా కాలిపోయాయి.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…