నెల్లూరు జిల్లాలో వైసీపీ నుండి టీడీపీ లోకి భారీ చేరికలు జరిగాయి. కందుకూరు నియోజకవర్గం పలుకూరు గ్రామం ఎస్సి కాలనీ చెందిన వైసీపీ నాయుకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా ఇంటూరి నాగేశ్వరావు పార్టీ కార్యాలయం లో వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా వుంటానని కష్టానష్టాల్లో మీకు తోడుగా వుంటానని, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చిన నా ఇంటి తలుపు తడితే వెంటనే స్పందిస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…