ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బిల్ గేట్స్..
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)తో సమావేశమయ్యారు. అనేక అంశాలు తమ మధ్య చర్చకు వచ్చినట్టు ట్విట్టర్(Twitter) వేదికగా గేట్స్ తెలిపారు.
మోదీతో సమావేశం స్ఫూర్తిమంతమని ట్విట్టర్ వేదికగా గేట్స్ వ్యాఖ్య..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహిళల నాయకత్వంలో అభివృద్ధి, వ్యవసారంగంలో సృజనాత్మక మార్పులు, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, భారత్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన అంశాలతో పాటు పలు ఇతర విషయాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయని తెలిపారు. గేట్స్‌తో మీటింగ్ అధ్భుతంగా సాగిందని మోదీ ట్విట్టల్ వేదికగా తెలిపారు. వ్యాఖ్యానించారు. పుడమి పరిక్షణ, సామాన్యులకు సాధికారత వంటి అనేక అంశాలపై చర్చించామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్ల జారీ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి