Friday, September 18, 2026
News Navigation
Friday, September 18, 2026
News Navigation

Breaking

Friday, September 18, 2026
Home Andhra PradeshKurnool వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

by Rama
Mahashivarathri

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు శ్రీకాళహస్తీ దేవస్థానం తరుపున కాళహస్తి ఈవో నాగేశ్వరరావు దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులకు ఈవో నాగేశ్వరరావుకు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు, అర్చకులు, అధికారులకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: స్వర్గీయ పట్నం రాజేందర్ రెడ్డి కి నివాళులు అర్పించిన పట్నం మహేందర్ రెడ్డి


అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.
షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా అక్టోబర్ …
సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ …
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: